రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట.. మిగిలిన కులాలకు కత్తిపీట : జగన్‌‌పై అచ్చెన్నాయుడు ఆగ్రహం

Siva Kodati |  
Published : Dec 25, 2022, 03:08 PM IST
రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట.. మిగిలిన కులాలకు కత్తిపీట : జగన్‌‌పై అచ్చెన్నాయుడు ఆగ్రహం

సారాంశం

సంక్షేమ పథకాల విషయంలో జగన్ తన  రెడ్డి వర్గానికి పెద్ద పీట వేస్తూ.. మిగిలిన కులాలకు కత్తిపీట వేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేయకుండా.. కేవలం తన కులానికే ప్రాధాన్యతనిస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్, పదవుల పంపకం ఇలా అన్నింట్లో సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, మిగిలిన వర్గాలకు కత్తిపీట వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 5.53 శాతం వున్న గిరిజనుల పించన్లకు రూ.971 కోట్లు కేటాయించిన జగన్.... తన సొంత సామాజివర్గం కోసం ఏర్పాటు చేసిన రెడ్డి కార్పోరేషన్‌ పింఛన్లకు మాత్రం రూ.1555 కోట్లు కేటాయించారని అచ్చెన్న ధ్వజమెత్తారు. 17.08 శాతం వున్న ఎస్సీలకు రూ 7 వేల కోట్లు... బీసీలకు 16 వేల కోట్లు కేటాయించాల్సిందిపోయి... ఎస్సీలకు 3 వేల కోట్లు, బీసీలకు 8 వేల కోట్లే కేటాయించి సగం నిధులు కోత కోశారని ఆయన దుయ్యబట్టారు. అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేయకుండా.. కేవలం తన కులానికే ప్రాధాన్యతనిస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సంక్షేమం అందుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

Also REad: బంధువులందరికీ సలహాదారు పోస్టులు.. కోట్లలో వేతనాలు , ఉద్యోగులకేవి జీతాలు : జగన్‌పై గోరంట్ల ఫైర్

ఇక నిన్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నా ఆపలేని స్ధితిలో జగన్ వున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారని గోరంట్ల మండిపడ్డారు. 20వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పుట్టినరోజు వేడుకల కోసం ఎంతైనా ఖర్చు పెడతారని ... కానీ కళాకారులకు పెన్షన్ ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం వద్ద డబ్బులు వుండవని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. బంధువులకు కోట్లు ఇచ్చి సలహాదారులుగా నియమించుకుంటున్నారని.. జగన్‌ను సాగనంపడానికి జనం సిద్ధమయ్యారని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సామాన్యుడిలా మత్య్సకార కుటుంబాలతో నారా లోకేష్ చిట్ చాట్ | Nara Lokesh Visits Fishermen in Puligadda
JC Prabhakar Reddy Challenges Peddareddy: పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ | Asianet Telugu