
వినుకొండ (vinukonda) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (bolla brahmanaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వెంటే ఉంటూ గోతులు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరినీ వదిలిపెట్టనని.. అందరినీ గుర్తు పెట్టుకుంటానని బొల్లా బ్రహ్మానాయుడు వ్యాఖ్యానించారు. వేల్పూరులో తానే నాయకుడినని.. తన కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. తన కారుపై టీడీపీ (tdp) నేత జీవీ ఆంజనేయులు (gv anjaneyulu) రాళ్ల దాడి చేయించారని బొల్లా ఆరోపించారు. దానికి కొంతమంది వెనక ఉండి సపోర్ట్ ఇస్తున్నారనంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
బొల్లా బ్రహ్మనాయుడు ఇటీవల కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో ఓ టీవీ చానెల్ ప్రతినిధిని అందరి ముందు తిడుతున్న వీడియోతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఏం చేసుకుంటావో చేసుకో.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బ్రహ్మనాయుడు వివరణ ఇచ్చుకోక తప్పలేదు.
గతేడాది వినుకొండ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన రసాభాసగా మారింది. రైతుల భూముల్లో నుంచి రోడ్డు ఎలా వేస్తారంటూ కొందరు ఎదురుతిరగడంతో విషయం సీరియస్ అయింది. రైతులకి కనీసం నష్టపరిహారం చెల్లించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి హైకోర్టు షాకిచ్చింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. ముందస్తు నోటీసులు లేకుండానే నిర్మాణాలు కూల్చివేశారంటూ బాధితులు హైకోర్టును (ap high court) ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బొల్లా బ్రాహ్మనాయుడికి నోటీసులిచ్చింది.