చింతమనేని ఎఫెక్ట్.. పవన్ కి గ్రామస్థుల షాక్

By ramya neerukondaFirst Published Sep 28, 2018, 2:35 PM IST
Highlights

పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ తగిలింది. ఏలూరు రూరల్‌ మండలం గుడివాకలంకలో పవన్‌ కళ్యాణ్ పర్యటనను గ్రామపెద్దలు బహిష్కరించారు. అంతేకాకుండా పవన్ పర్యటనలో ఎవరైనా పాల్గొంటే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే..పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పవన్.. ఎమ్మల్యే చింతమనేని  ప్రభాకర్ పై మాటలదాడికి దిగారు. పవన్ మాటలకు  చింతమనేని కూడా ధీటుగానే సమాధానం చెప్పారు.  అయితే.. తమ నాయకుడు చింతమనేనిని రౌడీ అంటూ పేర్కొనడం గ్రామస్థులకు నచ్చలేదు.

తమ నేతపై అనవసరంగా అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే.. గుడివాకలంక గ్రామస్థులు పవన్ పర్యటనను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పవన్ పర్యటనలో పాల్గొంటే జరిమానా కూడా విధిస్తామనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు..

పవన్ కల్యాణ్ కు ఇదే నా సవాల్: టీడీపి ఎమ్మెల్యే

కాళ్లు విరగొట్టి మూలన కూర్చోబెడతా: టీడీపీ, వైసీపీలకు పవన్ వార్నింగ్

పవన్.. ఎవరయ్యా నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది.. నన్ను ట్యూటర్‌గా పెట్టుకో: చింతమనేని

పవన్.. నేను మాట్లాడితే మూడు రోజులు అన్నం తినవు: చింతమనేని

పులివెందులలో జగన్‌పై మాట్లాడగలవా..? పవన్‌కు... చింతమనేని సవాల్

పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్

సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

click me!