ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలుచేసింది మన పున్నమ్మే... సర్వనాశనం చేశావుకదమ్మా!: విజయసాయి రెడ్డి

By Arun Kumar P  |  First Published Nov 8, 2023, 11:47 AM IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ఆనాడు కేంద్ర మంత్రిగా వున్న పురంధేశ్వరే కారణమని... ఆమెవల్లే రాష్ట్ర సర్వనాశనం అయ్యిందని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 


విశాఖపట్నం : కేంద్రలో మిత్రపక్షాలే... కానీ రాష్ట్రంలో మాత్రం బద్దశత్రువులు అన్నట్లుగా వుంది ఏపిలో వైసిపి, బిజెపి తీరు. ఇటీవల రాష్ట్ర బిజెపి బాధ్యతలు పురందేశ్వరి చేపట్టినప్పటి నుండి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. వైసిపి, బిజెపి నాయకుల మధ్య దూరం మరింత పెరిగి రాజకీయంగానే కాదు వ్యక్తిగత దూషణలను దిగే స్థాయికి చేరుకుంది. ఇలా కొంతకాలంగా వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి, పురందేశ్వరి మధ్య మాటలయుద్దం సాగుతోంది. తాజాగా మరోసారి పురందేశ్వరిపై సోషల్ మీడియా వేదికన ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి ఆనాడు కేంద్రమంత్రిగా వున్న పురందేశ్వరి కారణమని విజయసాయి ఆరోపించారు. 2009 లో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖ నుండి పోటీచేసి బొటాబోటి మెజారిటీతో గెలిచారని అన్నారు. ఇలా రాష్ట్రప్రజలు ఆమెను గెలిపిస్తేనే ఆమెకు కేంద్ర మంత్రి అయ్యారు... తీరా మంత్రిపదవిలో కూర్చుని ఆమె చేసిందేమిటో తెలుసా? రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేయడం అంటూ మండిపడ్డారు. మీరు ఇలాంటివారనే ప్రజలకు తెలుసు... నమ్మకం లేకపోబట్టే 36 శాతం ఓట్లు వచ్చాయి... అయినా గెలిచి బయటపడ్డావని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసారు. 

Latest Videos

రాష్ట్ర విభజన తర్వాత తానేమీ ఎరగనట్లుగానే పురంధేశ్వరి బిజెపిలో చేరిపోయారు... కానీ అప్పటికే ఆమె గురించి ప్రజలకు తెలిసిపోయిందని విజయసాయి రెడ్డి అన్నారు. అందువల్లే  2019 లో విశాఖ లోక్ సభకు బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తే ఓడించారని... ఆమెకు కేవలం 2.73 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేసారు.  పోలయిన 12లక్షల 50వేల ఓట్లలో ఆమెకు వచ్చినవి కేవలం 33వేల ఓట్లే.... అంటే ఆమె సామాజిక వర్గం వాళ్ళు కూడా ఓట్లు వేయనట్టేనని అన్నారు.  పున్నమ్మ  క్రెడిబిలిటీ ఇదీ అని ఒకసారి ఆమెకు గుర్తు చేయమని విశాఖ మిత్రుడొకరు ఈ లెక్కలు పంపారని విజయసాయి రెడ్డి తెలిపారు. 

Read More  చెల్లెమ్మా పురందేశ్వరి!.. పగోడికి కూడా నీలాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయి రెడ్డి

పురంధేశ్వరిది స్వార్థంతో కూడిన అవకాశవాదమని... అంది ఎలా ఉంటుందో చూడండి అంటూ విజయసాయి రెడ్డి వివరించారు. ఒకసారి పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి పురందేశ్వరి మళ్లీ బరిలోకి దిగరని అన్నారు. తనను గెలిపించిన ప్రజల మనోభావాలను పట్టించుకోరు... కాబట్టి రెండోసారి గెలిచే సీన్ వుండదుకాబట్టి మారక తప్పదన్నారు. ఇలా కాంగ్రెస్ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో వైఎస్సార్ హవాలో బయటపడ్డారని... కానీ బిజెపిలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి లక్షా 75 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసారు. 

''డబ్బు వ్యామోహమే తప్ప 8 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేశానికి, ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. మానవ వనరుల శాఖ, వాణిజ్య శాఖల సహాయ మంత్రిగా ప్రజలకు పనికొచ్చే ఏ చిన్న పని కూడా చేయలేదు. ఫలానా స్కీం తెచ్చారు. ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయించారు అని చెప్పుకోలేని పరిస్థితి. దృష్టంతా పైరవీలు, సంపాదనపైనే పెట్టారు'' అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 
 

click me!