విజయవాడ బాలిక ఆత్మహత్య : కామాంధుడిని నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చేయాలి.. తల్లిదండ్రుల డిమాండ్...

Published : Feb 02, 2022, 10:26 AM IST
విజయవాడ బాలిక ఆత్మహత్య :  కామాంధుడిని నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చేయాలి.. తల్లిదండ్రుల డిమాండ్...

సారాంశం

తనకు ఇష్టమైన రంగు డ్రెస్ వేసుకుని, వాకింగ్ కి వెళ్లేముందు హగ్ చేసుకుందని, కరోనా కేసులు పెరిగిపోతున్నాయని..  వాకింగ్ కి  వెళ్లవద్దని చెప్పానని..  అయినా వెళ్లి వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది అని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది.  మెట్లు, లిఫ్ట్ దగ్గర ఉండి నిందితుడు విష్ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని తల్లిదండ్రులు చెప్పారు.

విజయవాడ : vijayawadaలో కామాంధుడి Sexual harassment తాళలేక suicide చేసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తలుచుకుంటూ తల్లడిల్లి పోతున్నారు. దీక్షిత ఫోటోను దగ్గర పెట్టుకుని,  చూసుకుంటూ  కన్నీటి పర్యంతం అవుతున్నారు. CCTV footage లోని  దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. దుర్మార్గుడిని నడిరోడ్డుపై encounter చేయండి అని రోదిస్తున్నారు. మరో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాలని,  తమకు ఎదురైన కష్టం మరొకరికి రాకూడదంటూ వేడుకుంటున్నారు. 

తనకు ఇష్టమైన రంగు డ్రెస్ వేసుకుని, వాకింగ్ కి వెళ్లేముందు హగ్ చేసుకుందని, కరోనా కేసులు పెరిగిపోతున్నాయని..  వాకింగ్ కి  వెళ్లవద్దని చెప్పానని..  అయినా వెళ్లి వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది అని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది.  మెట్లు, లిఫ్ట్ దగ్గర ఉండి నిందితుడు విష్ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని తల్లిదండ్రులు చెప్పారు.

పరామర్శించిన  ఎమ్మెల్సీ..
బాధిత కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి పరామర్శించి ఓదార్చారు. నిందితుడిని నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేసి మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాలిక తల్లి తనతో అన్నట్లు  ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన…
కామాంధుడు వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఆందోళన చేపట్టారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళులర్పించారు. ఫైర్ స్టేషన్ సెంటర్ లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  సాహిత్య అకాడమీ చైర్ పర్సన్  పిల్లం గోళ్ళ శ్రీలక్ష్మి, ఈడ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి,  మేయర్  షేక్ నూర్జహాన్,  స్మార్ట్ సిటీ చైర్పర్సన్  బొద్దాని అఖిల, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా, Sexual harassmentలతో బాలికను చిదివేసిన tdp leader వినోద్ జైన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల ఎదుట విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లోని లోటస్ లెజెండ్ అపార్ట్ మెంట్ లో టిడిపి నేత vinod jain లైంగిక వేధింపులు తాళలేక 14 ఏళ్ల బాలిక suicideకు పాల్పడిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.  దీనిపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతురాలు  suicide noteలో పేర్కొన్నట్లుగా తాను రెండు నెలలుగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. 

ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని.. స్కూలుకు వెళ్లి, వచ్చే సమయాల్లో లిఫ్ట్, మెట్ల వద్ద వేచి ఉండేవాడినని ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందించే వాడినని చెప్పుకొచ్చాడు. తాను చేసింది తప్పే అని.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని... వ్యవహారం ఇంతవరకు వస్తుందని కూడా తాను ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది.  మరోవైపు..  ఆత్మహత్యకు ముందు బాలిక రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.  అందులో ఎక్కువగా  ప్రేమానుబంధాలకు ఎంతో ప్రాధాన్యత  ఇచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu