
ఓ షాప్ యజమాని నిర్లక్ష్యం డిగ్రీ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. వాటర్ బాటిల్‌కు బుదలు యాసిడ్ బాటిల్ ఇవ్వడంతో.. అది తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఎనికెపాడులో చోటుచేసుకున్న ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. లయోల కళాశాలలో ఎవియేషన్ విభాగంలో చైతన్య డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీన చైతన్య వాలీబాల్ ఆడేందుకు ఎనికేపాడు వవెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే దాహంతో వాటర్ బాటిల్ కొనేందుకు రోడ్డు పక్కన ఉన్న ఓ షాపు వద్దకు వెళ్లాడు.
అయితే షాపులోని వ్యక్తి నిర్లక్ష్యంగా చైతన్యకు వాటర్ బాటిల్‌కు బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అయితే తీవ్రదాహంతో ఉన్న విద్యార్థి చైతన్య బాటిల్లోని యాసిడ్ తాగాడు. దీంతో చైతన్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే చైతన్య కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం లయోల కళాశాల యాజమన్యం విరాళాలు సేకరిస్తుండడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.
యాసిడ్ తాగడం వల్ల అది చైతన్య ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని.. ప్రస్తుతం హారిణి ఆస్పత్రిలో ఐసీయూలో అతనికి వైద్యం అందిస్తున్నారని లయోల కాలేజ్ యాజమాన్యం తెలిపింది. చైతన్య వైద్యం కోసం ఈ నెల 18వ తేదీన విరాళాలు సేకరించనున్నట్టుగా కాలేజ్ యాజమాన్యం నోటీసులో పేర్కొంది.