హనుమాన్ జయంతి ర్యాలీ.. కర్నూలు జిల్లా హోలగుందలో ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల అదుపులో 20 మంది..

Published : Apr 17, 2022, 12:57 PM IST
హనుమాన్ జయంతి ర్యాలీ.. కర్నూలు జిల్లా హోలగుందలో ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల అదుపులో 20 మంది..

సారాంశం

కర్నూలు హోలగుందలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హోలగుందలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి.

కర్నూలు హోలగుందలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసకుంది. దీంతో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందలోనే మకాం వేశారు. వివరాలు.. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హోలగుందలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే పలువురుకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణ చోటుచేసుకున్న సమయంలో అక్కడి పరిమిత సంఖ్యలో మాత్రమే పోలీసులు ఉన్నారు. 

ఇరువర్గాల ఘర్షణ చోటుచేసుకున్నట్టుగా తెలియడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని.. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఓ వర్గానికి చెందిన వారు పోలీసు స్టేషన్‌‌ను ముట్టడించి నినాదాలు చేశారు. ఇదే సమయంలో వర్షం కురవడంతో వారు ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు ఈ క్రమంలోనే డీఎస్పీలు వినోద్‌‌కుమార్ హోలగుందకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు.

అయితే నేడు మరోసారి హోలగుందలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల ఘర్షణల నేపథ్యంలో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హోలగుందలోనే మకాం వేశారు. 

‘‘కర్నూలులోని అల్లూరులోని హొలగుందలో విశ్వహిందూ పరిషత్ హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించింది. పోలీసుల సలహాకు విరుద్ధంగా డీజే సెట్‌లను ఉపయోగించారు. వీరి ర్యాలీ మసీదు దగ్గరికి వెళ్లినప్పుడు పోలీసులు డీజే సెట్‌లను మూసివేయాలని కోరారు. కానీ, వారు అక్కడి ఆగి.. మసీదు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ముస్లిం వర్గానికి చెందిన వారు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు’’ అని కర్నూలు ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఏఎన్ఐకి తెలిపారు.

‘‘పోలీసులు వీహెచ్‌పీ సభ్యులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఊరేగింపు మసీదు నుండి కొంచెం దూరంగా వెళ్ళగానే.. వారు మళ్లీ DJ సౌండ్స్ ఆన్ చేశారు. ఇది రెండు వర్గాల మధ్య చిన్న వాగ్వాదానికి దారితీసింది. కొద్దిసేపటికే.. అది రాళ్ల దాడికి దారితీసింది. తర్వాత పోలీసు బలగాలను రప్పించి.. గుంపును చెదరగొట్టారు. దాదాపు 10 నిమిషాల పాటు రాళ్లదాడి జరిగింది. మేము సేకరించిన ఫుటేజీ ఆధారంగా 20 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారిస్తున్నాం. ఘటన స్థలంలో పోలీసులను మోహరించాం. పరిస్థితి అదుపులో ఉంది’’ అని సుధీర్ కుమార్ రెడ్డి చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!