విజయవాడ సృష్టి ఆసుపత్రి కేసులో ట్విస్ట్: డాక్టర్ కరుణ కోసం పోలీసుల గాలింపు

Published : Sep 08, 2020, 02:41 PM IST
విజయవాడ సృష్టి ఆసుపత్రి కేసులో ట్విస్ట్: డాక్టర్ కరుణ కోసం పోలీసుల గాలింపు

సారాంశం

నగరంలోని సృష్టి ఆసుపత్రి కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. డాక్టర్ కరుణను బినామీగా చేసి డాక్టర్ ఈ ఆసుపత్రిని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు.

విజయవాడ: నగరంలోని సృష్టి ఆసుపత్రి కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. డాక్టర్ కరుణను బినామీగా చేసి డాక్టర్ ఈ ఆసుపత్రిని నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు.

ఈ ఆసుపత్రిలో ఇప్పటికే 37 మంది టెస్ట్ ట్యూబ్ బేబీలు పుట్టారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.37 మంది పిల్లలు ఎక్కడున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ కరుణు విచారిస్తే  మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 

అయితే డాక్టర్ కరుణ పోలీసులకు కన్పించకుండా పోయారు. ఆమె పోలీసులకు చిక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. డాక్టర్ కరుణ దొరికితే  ఈ కేసులో మరిన్ని విసయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఆమె ఫోన్ కాల్ డేటా ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశాలు లేకపోలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే విశాఖపట్టణంలోని సృష్టి ఆసుపత్రి వ్యవహరంలో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ నమ్రతతో పాటు ఆమెకు సహకరించిన పలువురు అరెస్టయ్యారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu