యువతి హత్య: యూపీకి విజయవాడ పోలీసులు

Published : Jul 30, 2021, 09:48 AM IST
యువతి హత్య: యూపీకి విజయవాడ పోలీసులు

సారాంశం

యూపీకి విజయవాడ పోలీసులు శుక్రవారం నాడు బయలుదేరారు. విజయవాడకు చెందిన ఫాతిమాను ప్రేమ పేరుతో యూపీకి తీసుకెళ్లి హత్య చేశారు ఇద్దరు. ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఇవాళ యూపీకి వెళ్లారు.  

లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్ రాష్ట్రంలోని సహరంపుర హత్యకు గురైన  విజయవాడకు చెందిన యువతి ఫాతిమా కేసు విషయమై విజయవాడ పోలీసులు శుక్రవారం నాడు యూపీకి బయలుదేరారు. ఈ నెల 10వ తేదీన ఆచూకీ కన్పించకుండా పోయిన  యువతి  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో హత్యకు గురైంది.  ప్రేమ పేరుతో యువతిని యూపీకి తీసుకెళ్లి నిందితులు హత్య చేశారని పోలీసులు గుర్తించారు. నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ పోలీసుల అదుపులో ఇద్దరు యువకులున్నారు. నిందితులను విజయాడకు తీసుకెళ్లేందుకు తాము రక్షణ కల్పిస్తామని యూపీ పోలీసులు చెప్పారు.

also read:యూపీలో విజయవాడ యువతి హత్య: ముందుకు సాగని దర్యాప్తు

 యువతి హత్య కేసు విషయమై ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీతో  విజయవాడ ఎంపీ కేశినేని నాని  ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు.ఇవాళ విజయవాడ నుండి ఓ ఎస్ఐ, కానిస్టేబుల్, స్థానికులను తీసుకొని యూపీకి వెళ్లారు.  యూపీ పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?