: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు.
విజయవాడ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంతో పాటు రమేష్ ఆసుపత్రి మేనేజ్‌మెంట్ పై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. ఆసుపత్రిలో ఉన్నవారిని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
undefined
also read:అలారం మోగలేదు, రూల్స్ బ్రేక్: విజయవాడ అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ జయరామ్ నాయక్
రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చి చికిత్స అందిస్తున్నారు. అయితే కోవిడ్ సెంటర్ గా మార్చిన తర్వాత అనుమతి తీసుకోలేదని అగ్ని మాపక సిబ్బంది ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది హోటల్ ను పరిశీలించారు.
హోటల్ లో రూల్స్ ను పాటించని విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు నివేదికను తయారు చేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోం మంత్రి సుచరిత , మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లు హోటల్ ను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును మంత్రులు అధికారుల నుండి అడిగి తెలుసుకొన్నారు.
ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ విషయమై మంత్రులు మరోసారి మీడియాకు వివరాలను అందించనున్నారు.