అలారం మోగలేదు, రూల్స్ బ్రేక్: విజయవాడ అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ జయరామ్ నాయక్

By narsimha lode  |  First Published Aug 9, 2020, 12:08 PM IST

స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిబంధనలను ఉల్లంఘించిందని ఫైర్ డీజీ జయరామ్ నాయక్ ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో అలారం మోగలేదని ఆయన తెలిపారు.


విజయవాడ:స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిబంధనలను ఉల్లంఘించిందని ఫైర్ డీజీ జయరామ్ నాయక్ ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో అలారం మోగలేదని ఆయన తెలిపారు. అలారం మోగితే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న ఘటనపై  ఇవాళ ఆయన  విచారణ జరిపారు.

అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. కోవిడ్ సెంటర్ గా హోటల్ ను మార్చిన తర్వాత అనుమతి తీసుకోలేదని ఫైర్ డీజీ ఆయన గుర్తు చేశారు. 

Latest Videos

undefined

also read:ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘణ: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 11కి చేరిన మృతులు

స్వర్ణ ప్యాలెస్ హోటల్ 30 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుటి వరకు 11 మంది ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదం  ఎలా జరిగింది అనేదాని పై విచారణ చేస్తున్నామన్నారు.అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయమై హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు. 

ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఈ హోటల్ ను కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తోంది. 

click me!