క్షణికావేశంలోనే చెన్నుపాటి గాంధీపై దాడి : తేల్చేసిన విజయవాడ సీపీ, టీడీపీ శ్రేణుల ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 4, 2022, 10:52 PM IST
Highlights

చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనలో కేసు నమోదు చేశామన్నారు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా. నిందితులపై 326, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశామని.. దాడిలో ఎటువంటి మారణాయుధాలు ఉపయోగించలేదని కమీషనర్ వెల్లడించారు. 
 

చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనలో కేసు నమోదు చేశామన్నారు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలు నియమించామన్నారు . సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామని... క్షణికావేశంలో చేతితోనే గాంధీపై దాడి చేశారని ఆయన తేల్చిచెప్పారు. దాడి చేసిన వారిని అనుమానితులుగా కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని.. స్పాట్‌లో ఉన్న వారిని కూడా విచారిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. నిందితులపై 326, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశామని.. దాడిలో ఎటువంటి మారణాయుధాలు ఉపయోగించలేదని కమీషనర్ వెల్లడించారు. 

దాడిలో వైసీపీ నాయకులు ఉన్నారని.. గత 10 నెలల్లో ఇటువంటి ఘటనలు నగరంలో ఎక్కడా జరగలేదని ఆయన పేర్కొన్నారు. నగరంలో మూడేళ్లలో కేసుల సంఖ్య చాలా తగ్గిందని.. సిటీలో గొడవలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కాంతిరాణా అన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికలో కూడా చేతితో దాడి చేయడం వల్ల గాయం జరిగిందనీ రిపోర్ట్ ఇచ్చారని సీపీ తెలిపారు. దాడి జరిగిన వారిలో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వున్న వాళ్ళు ఉన్నారని.. విచారణ తరువాత అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని కాంతిరాణా పేర్కొన్నారు. అయితే సీపీ వివరణపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. 

ALso Read:టీడీపీ మాజీ కార్పొరేటర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... వైసీపీ గూండాల పనే అని ఆరోపిస్తున్న టీడీపీ

కాగా...విజయవాడకు చెందిన మాజీ కార్పోరేటర్ చెన్నుపాటి గాంధీపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన కుడి కంటికి గాయమైంది. దీంతో ఆయనను చికిత్స కోసం తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. దేవినేని అవినాష్ అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ దాడి చేశారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నారు. 
 

click me!