డిస్టలరీలన్నీ మీవే... వైఎస్ భారతిపై ఆరోపణలేంటీ, నోరు అదుపులో పెట్టుకోండి: టీడీపీ నేతలపై ఉషాశ్రీ చరణ్ ఫైర్

By Siva KodatiFirst Published Sep 4, 2022, 7:23 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఉషాశ్రీ చరణ్. ఏపీలోని డిస్టలరీలు అయ్యన్నపాత్రుడు, ఎస్పీవై రెడ్డి, యనమలకు చెందినవి కావా అని ఆమె ప్రశ్నించారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. 
 

టీడీపీ నేతలు నీచరాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు మంత్రి ఉషాశ్రీ చరణ్. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాం అంటూ వైఎస్ భారతిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. లిక్కర్ మాఫియాను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీలోని డిస్టలరీలు అయ్యన్నపాత్రుడు, ఎస్పీవై రెడ్డి, యనమలకు చెందినవి కావా అని ఉషాశ్రీ చరణ్ నిలదీశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులై పారిందని.. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. 

అంతకుముందు ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి సైతం చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శలు గుప్పించారు. భువనేశ్వరి, బ్రాహ్మణికి సంబంధించిన అన్ని విషయాలు మాకు తెలుసునని కళ్యాణి హెచ్చరించారు. వైఎస్ భారతి గురించి ఏమైనా మాట్లాడితే నాలుక కోస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ భారతి ఏ రోజైనా రాజకీయాలు మాట్లాడారా అని కళ్యాణి ప్రశ్నించారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు ఈరోజు 2 లక్షల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు.. కేవలం పాల వ్యాపారం వల్లేనంటే ఎవరైనా నమ్ముతారా అని ఆమె నిలదీశారు. దీని వెనుక భువనేశ్వరి, బ్రాహ్మణిల లిక్కర్ వ్యాపారం వుందని కళ్యాణి ఆరోపించారు. 

ALso Read:పైకి పాల వ్యాపారం.. లోపల లిక్కర్ బిజినెస్ : చంద్రబాబు ఫ్యామిలీపై పోతుల సునీత ఆరోపణలు

జగన్ సీఎం అయ్యాక.. ఒక్క డిస్టిలరీకైనా అనుమతులు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక 44 వేల బెల్ట్ షాపులు రద్దు చేశారని.. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించారని .. 4,500 పర్మిట్ రూమ్‌లను తొలగించారని కల్యాణి గుర్తుచేశారు. పర్మిట్ రూమ్‌లను చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేశారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే.. ఆయన కడుపున పుట్టిన భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని కళ్యాణి ఆరోపించారు. 

లిక్కర్ సిండికేట్ నుంచి భువనేశ్వరి వందలకోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆరోజున భువనేశ్వరి ముడుపులు తీసుకున్నారు కాబట్టే.. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారని కల్యాణీ ఆరోపించారు. ముడుపుల కోసం భువనేశ్వరి, బ్రాహ్మణి గొడవ పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అది నారా కుటుంబం కాదని.. సారా కుటుంబమని కల్యాణి అభివర్ణించారు. ఎస్‌పీవై రెడ్డి డిస్టలరీ నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎన్ని ముడుపులు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.

click me!