కేటరింగ్ పనులంటూ యువతులతో అశ్లీల నృత్యాలు: గుట్టు రట్టయిందిలా...

Published : Sep 21, 2018, 03:05 PM IST
కేటరింగ్ పనులంటూ యువతులతో అశ్లీల నృత్యాలు: గుట్టు రట్టయిందిలా...

సారాంశం

కేటరింగ్ పనులు ఇప్పిస్తామని అమ్మాయిలను తీసుకెళ్లి  అశ్లీల నృత్యాలను చేయిస్తున్నారు.


విజయవాడ: కేటరింగ్ పనులు ఇప్పిస్తామని అమ్మాయిలను తీసుకెళ్లి  అశ్లీల నృత్యాలను చేయిస్తున్నారు.  అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తున్న విషయాన్ని  పోలీసులు గుర్తించారు. 

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన తమ బాలిక కనిపించడం లేదని ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. పేదలు నివసించే ప్రాంతాలపై  ఈ ముఠా కన్నేసింది. 

పదిహేనేళ్లు, 16 ఏళ్ల వయస్సున్న బాలికలను మాయమాటలతో నమ్మిస్తున్నారు.  కేటరింగ్ పనులు ఇప్పిస్తామని నమ్మించి తమతో తీసుకెళ్తారు.  తూర్పుగోదావరి, విశాఖతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగే  జాతరలు, ఉత్సవాల్లో ఈ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే కేటరింగ్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఈ నృత్యాలను చేయనని మొండికేస్తే   చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విశాఖ జిల్లాకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను  పోలీసులు  అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు