వల్లభనేని వంశీ రాజీనామా: బుజ్జగింపులకు చంద్రబాబు కమిటీ

By narsimha lode  |  First Published Oct 28, 2019, 12:55 PM IST

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఇద్దరితో కమిటీని ఏర్పాటు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు ఈ బాధ్యతను అప్పగిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. 


విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బుజ్జగించే బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు అప్పగిస్తూ టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు వల్లభనేని వంశీకి సోమవారం నాడు చంద్రబాబునాయుడు మరో లేఖను రాశారు.

తనకు ధన్యవాదాలు చెబుతూ వల్లభనేని వంశీ రాసిన లేఖకు చంద్రబాబునాయుడు స్పందిస్తూ ఈ లేఖ రాశారు.రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులను నిరసిస్తూ పోరాటం చేయడం కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయడానికి గాను  విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు
లు సమన్వయం చేస్తారని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Latest Videos

Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని

పార్టీతో చారిత్రక అనుబంధాన్ని వంశీ గుర్తు చేసుకోవడం పట్ల చంద్రబాబు వల్లభనేని వంశీని అభినందించారు. పార్టీతో పాటు తాను కూడ అండగా నిలుస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు  ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేశారు. ఈ రెండు పదవులతొ పాటు రాజకీయాల నుండి కూడ తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు.

Also Read: అండగా ఉంటా, అది సరైంది కాదు: వల్లభనేని వంశీకి బాబు ధైర్యం

వల్లభనేని వంశీ రాజకీయాలకు కూడ దూరంగా ఉంటానని ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగానే  ఈ నిర్ణయం తీసుకొన్నారనే  టీడీపీ నాయకత్వం భావిస్తొంది.

స్థానికంగా వైసీపీ నేతల కారణంగా తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం రాజీనామా చేసినట్టుగా  వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. రాజకీయంగా ప్రత్యర్థుల బెదిరింపులకు వంశీ భయపడే మనస్తత్వం ఉన్నవాడు కాదని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడ ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

Also Read: చంద్రబాబు లేఖకు వల్లభనేని వంశీ జవాబు ఇదీ..

జగన్ సీఎం అయిన తర్వాత నకిలీ ఇళ్లపట్టాల  కేసు నమోదు కావడంతో వంశీ ఈ రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. స్థానిక వైసీపీ నేతలు రెవిన్యూ అధికారులను ఎలా ఈ రకంగా తనపై కేసు పెట్టించారో ఈ నెల 24వ తేదీన వంశీ ప్రకటించారు.కానీ, ఈ కేసు కారణంగానే వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం పట్ల టీడీపీ నేతలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: వల్లభనేని రాజీనామా వెనక వైఎస్ జగన్ వ్యూహం ఇదే...

నియోజకవర్గంలో వైసీపీ నేతలు, అధికాారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో పరోక్షంగా వల్లభనేని వంశీ పరోక్షంగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేశారు. 

ఈ లేఖకు చంద్రబాబునాయుడు స్పందించారు. తనతో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందని చంద్రబాబునాయుడు వల్లభనేని వంశీకి హామీ ఇచ్చారు. తనకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇవ్వడంపై వల్లభనేని వంశీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వంశీని బుజ్జగించేందుకు ఇద్దరిని నియమిస్తూ మరోసారి వంశీకి లేఖ రాశారు. 

ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ టీడీపీని వీడే అవకాశం లేదని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు తెలిపారు. వంశీ ఆవేదనతోనే చంద్రబాబుకు లేఖ రాశారని, వంశీతో పార్టీ ప్రతినిధులు చర్చిస్తారని ఆయన తెలిపారు. ఇవాళ సాయంత్రంలోగా వివాదం సమసిపోతుందని బచ్చుల అర్జునుడు ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

click me!