నదీ విహారం లేకుండానే ముగిసిన దుర్గమ్మ తెప్పోత్సవం

By Siva KodatiFirst Published Oct 25, 2020, 9:44 PM IST
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ ఆదివారం కన్నుల పండుగగా సాగింది. 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ ఆదివారం కన్నుల పండుగగా సాగింది.

కరోనా వ్యాప్తి, ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి కారణంగా ఉత్సవమూర్తుల నదీ విహారాన్ని అధికారులు నిలిపివేశారు. దుర్గాఘాట్‌లోని నది ఒడ్డునే హంస వాహనంపై ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అర్చకులు పూజలు నిర్వహించారు.

ఇదే సమయంలో దుర్గా ఘాట్‌లో కృష్ణా నదికి నిర్వహించిన హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం శమీ పూజ నిమిత్తం సంప్రదాయం ప్రకారం ఉత్సవమూర్తులను పాతబస్తీ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

దుర్గా ఘాట్‌లో నిర్వహించిన తెప్పోత్సవం కార్యక్రమంలో విజయవాడ నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గ గుడి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

click me!