కరోనా మృత్యుకేళి... దుర్గగుడి అర్చకుడి మృతి

By Arun Kumar P  |  First Published Apr 25, 2021, 7:29 AM IST

నిత్యం విజయవాడ కనకదుర్గమ్మ సేవలో తరించే అర్చకులు రాచకొండ శివప్రసాద్ ను కూడా ఈ కరోనా వైరస్ బలితీసుకుంది. 
 


విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి మృత్యుకేళి కొనసాగుతోంది. తాజాగా నిత్యం విజయవాడ కనకదుర్గమ్మ సేవలో తరించే అర్చకులు రాచకొండ శివప్రసాద్ ను కూడా ఈ కరోనా వైరస్ బలితీసుకుంది. 

ఇటీవలే కోవిడ్ బారినపడ్డ శివప్రసాద్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అయితే గత శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. కానీ శనివారం మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించి ఇంటివద్దే మృతి చెందారు. 

Latest Videos

undefined

read more  ఏపీలో కరోనా కరాళనృత్యం: మరోసారి 11 వేలు దాటిన కేసులు... సిక్కోలులో తీవ్రరూపు

 విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో పనిచేస్తున్న సిబ్బందిలో 43 మందికి కరోనా సోకగా 20 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. మిగిలినవారంతా  హోం క్వారంటైన్ లో ఉన్నారు.  ఈ ఆలయంలో పనిచేసే  ఐదుగురు అర్చకులకు కూడా కరోనా సోకింది. వారు కూడ చికిత్స తీసుకొంటున్నారు. 

ఇక ఏపీలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ విషయమై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సబ్ కమిటీ  సభ్యులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి తెప్పించుకోవాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.  

click me!