ఏపీలో కరోనా కరాళనృత్యం: మరోసారి 11 వేలు దాటిన కేసులు... సిక్కోలులో తీవ్రరూపు

Siva Kodati |  
Published : Apr 24, 2021, 07:11 PM IST
ఏపీలో కరోనా కరాళనృత్యం: మరోసారి 11 వేలు దాటిన కేసులు... సిక్కోలులో తీవ్రరూపు

సారాంశం

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ మరోసారి పదకొండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,698 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ మరోసారి పదకొండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,698 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 10,20,926కి చేరింది. నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,616కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి 6, నెల్లూరు 6, అనంతపురం 4, చిత్తూరు 4, శ్రీకాకుళం 3, పశ్చిమ గోదావరి 3, గుంటూరు 2, కృష్ణ 2, కర్నూలు 2, విశాఖపట్నం 2, విజయనగరం 2, ప్రకాశం జిల్లాలో ఒక్కరు మరణించారు.

నిన్న 4,421 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,31,839కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 81,471కి చేరుకున్నాయి.

గత 24 గంటల వ్యవధిలో 50,972 మంది శాంపిల్స్ పరీక్షించగా.. ఏపీలో ఇప్పటి వరకు కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,59,31,722కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు అనంతపురం 1066, చిత్తూరు 1306, తూర్పుగోదావరి 909, గుంటూరు 1581, కడప 549, కృష్ణా 631, కర్నూలు 820, నెల్లూరు 902, ప్రకాశం 462, శ్రీకాకుళం 1641, విశాఖపట్నం 947, విజయనగరం 592, పశ్చిమగోదావరిలలో 292 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu