ఈ నెల 25 న విజ‌య‌వాడ‌ దుర్గగుడి మూసివేత.. ద‌ర్శ‌నాల నిలివేత‌.. కార‌ణ‌మేమిటంటే..?

Published : Oct 08, 2022, 05:14 PM IST
ఈ నెల 25 న విజ‌య‌వాడ‌ దుర్గగుడి మూసివేత.. ద‌ర్శ‌నాల నిలివేత‌.. కార‌ణ‌మేమిటంటే..?

సారాంశం

సూర్యగ్రహణం కారణంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్నదుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల 25న  ద్వారబంధనం చేసి మూసివేశారు. తిరిగి మ‌రుస‌టి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, మహానివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు  అమ్మ  వారి దర్శనం కల్పించనున్నారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్నదుర్గమ్మ ఆలయాన్ని ఈ నెల 25న మూసివేయనున్నారు. ఆ రోజు సూర్యగ్రహణం కావ‌డంతో  అమ్మవారి ఆలయంతో పాటు ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న ఇతర దేవాలయాను కూడా మూసివేయనున్నట్లు ఆల‌య అధికారులు వెల్లడించారు. 

ఈ నెల 25 తేదీ ఉదయం 10 గంటలకు దుర్గ అమ్మ వారికి మహా నివేదన, త‌దిత‌ర‌ పూజా కార్యక్రమాలన‌రు నిర్వహించి.. ద్వారబంధనం చేసి ఆలయాన్ని మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా ఆలయంలో నిర్వహించే అభిషేకాలు, అర్చనలు, నిత్య హోమాలు, నిత్య కల్యాణోత్సవాలు  నిలిపివేయనున్నారు. ఆ రోజు ఎలాంటి దర్శనాలు ఉండబోవ‌ని ఆల‌య పూజ‌రులు, అధికారులు స్పష్టం చేశారు.

ఆల‌యాన్ని తిరిగి 26న 26న ఉదయం 6 గంటలకు తెరవనున్నారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, మహానివేదన,  అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు,  నిర్వహించిన అనంతరం భ‌క్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు. 26న మధ్యాహ్నం 12.10 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు ఉదయం అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు  అధికారులు స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్