ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగ్స్

Published : Oct 08, 2022, 04:38 PM ISTUpdated : Oct 08, 2022, 05:19 PM IST
 ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగ్స్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. అలాగే పలువురు ట్రైనీ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. అలాగే పలువురు ట్రైనీ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారుల బదిలీల విషయానికి వస్తే..  సివిల్ సప్లై డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్ కలెకర్ట్‌గా మల్లారపు నవీన్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా విష్ణు చరణ్, మధ్యాహ్నం భోజన పథకం డైరెక్టర్‌గా నిధి మీనా, ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌ల విషయానికి వస్తే.. 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్‌లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సల్, నరసాపురం సబ్ కలెక్టర్‌గా మల్లవరకు సూర్యతేజ, టెక్కలి సబ్ కలెక్టర్‌గా రవికుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూరుల్ కమిర్, అదోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్‌గా అధితిసింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తీక్, గుడూరు సబ్ కలెక్టర్‌గా శోభిక, కందుకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్‌లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్