అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక: దుర్గగుడి ఈవో సురేశ్‌పై బదిలీ వేటు

By Siva KodatiFirst Published Apr 7, 2021, 6:15 PM IST
Highlights

దుర్గగుడి ఈవో సురేశ్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన అవినీతిపై మీడియాలో కథనాలు వెలువడటంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 

కాగా, విజయవాడ దుర్గగుడిలో చోటు చేసుకొన్న అక్రమాలకు ఏసీబీ నివేదికలో రోజుకో  విషయం వెలుగు చూస్తోంది.  ఏసీబీ నివేదిక ఆధారంగా ఇప్పటికే 20 మందికిపైగా ఉద్యోగులపై వేటేసింది దేవాదాయశాఖ.

మూడు రోజుల క్రితం దుర్గగుడి ఈవో సురేష్ బాబు అక్రమాలపై  ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. మరో నెల రోజుల్లోపుగా పూర్తి స్థాయి నివేదికను అందించనుంది.

దుర్గగుడి ఆస్తుల విషయంలో ఏసీబీ తన నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది.  అమ్మవారి ఆస్తులకు  రక్షణ లేకుండా పోయిందని  ఈ నివేదిక అభిప్రాయపడింది. వందల కోట్ల విలువైన భూములు, ఆస్తులను ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.

Also Read:చీరెల స్కాం: దుర్గగుడిలో అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ నివేదికలు

3 ఏళ్లకు ఒక్కసారి ప్రాపర్టీ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంది. అయితే చాలా ఏళ్లుగా ఆస్తుల వివరాలను అప్‌డేట్ చేయడం లేదని గుర్తించింది.

మరోవైపు  ప్రతి ఏటా ఆస్తుల వివరాలను నమోదు చేసే రిజిస్టర్ ను కూడ అప్ డేట్ చేయాలి. కానీ పదేళ్ల నుండి ఈ రిజిస్టర్ ను అప్‌డేట్ చేయడం లేదు.ఈ రిజిస్టర్ ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల దుర్గమ్మ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని  ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.

click me!