హ్యాట్సాఫ్ పోలీస్ : పసిబిడ్డను ఆడించి.. పోలింగ్ కేంద్రంలోని తల్లికి ఊరట..

By AN TeluguFirst Published Apr 7, 2021, 4:04 PM IST
Highlights

పోలీసులంటే కర్కశత్వానికి మారుపేరుగానే చూస్తాం.. వారిని చూడగానే ఆమడదూరం భయంతో పారిపోయే భావన సమాజంలో పాతుకుపోయింది. అయితే పోలీసులు మానవత్వం చాటుకుంటున్న సంఘటనలు అడపాదడపా జరుగుతుంటాయి. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

పోలీసులంటే కర్కశత్వానికి మారుపేరుగానే చూస్తాం.. వారిని చూడగానే ఆమడదూరం భయంతో పారిపోయే భావన సమాజంలో పాతుకుపోయింది. అయితే పోలీసులు మానవత్వం చాటుకుంటున్న సంఘటనలు అడపాదడపా జరుగుతుంటాయి. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పసిబిడ్డతో ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రానికి వచ్చింది ఓ తల్లి.  క్యూలైన్లో నిల్చోవడంతో చిన్నారికి ఉక్కపోత పోసి.. ఏడవడం ప్రారంభించింది.

అక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇది గమనించి తనతోపాటు తీసుకుని టెంట్ కిందికి వచ్చాడు. ఏడవకూడదంటూ ఊరడించాడు. చిన్నారి తల్లి ఓటు వేసి వచ్చేవరకు బిడ్డను ఎత్తుకుని ఆడించాడు.

బిడ్డను ఎత్తుకున్న కానిస్టేబుల్ ఫోటోని  ఏపీ పోలీస్ శాఖ  తన ట్విట్టర్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. తమిళనాడులో చోటుచేసుకున్న సంఘటనను, అక్కడి పోలీస్ కానిస్టేబుల్ ను ఏపీ పోలీస్ శాఖ ఎందుకు ప్రశంసిస్తున్నారంటే.. సదరు కానిస్టేబుల్ ది అనంతపురం కు చెందినవాడు. తమిళనాడు ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్నాడు.

 ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్లో తమిళనాడు ఎన్నికల్లో మానవత్వం చాటుకున్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్.. అనంతపురం పోలీస్ కానిస్టేబుల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ తల్లి తన నెల రోజుల పసికందును తీసుకుని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చింది. ఆ మహిళా ఓటు వేసి వచ్చేవరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆడించాడు. ఈ కానిస్టేబుల్ చేసిన పని అక్కడున్న వారందరూ ప్రశంసించారు.. అంటూ ట్వీట్ చేసింది.

ఏపీ పోలీస్ శాఖ సదరు కానిస్టేబుల్ పేరును వెల్లడించలేదు. ఈ ఫోటోను చూసిన వారంతా ప్రశంసిస్తున్నారు.  గుడ్ జాబ్, హాట్సాఫ్ అంటూ పొగుడుతున్నారు. ఇక తమిళనాడు 38 జిల్లాలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3998 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఎన్నికలు ఈ నెల 6న జరిగాయి. 62.86 శాతం ఓటింగ్ నమోదైంది. మే 2న వీరి భవితవ్యం తేలనుంది. 

click me!