బెజవాడ బీటెక్ విద్యార్ధి హత్య కేసులో కీలక విషయాలు..వెలుగులోకి ప్రేమ వ్యవహారం, తండ్రితో చివరి మాటలు

Siva Kodati |  
Published : May 10, 2023, 03:30 PM IST
బెజవాడ బీటెక్ విద్యార్ధి హత్య కేసులో కీలక విషయాలు..వెలుగులోకి ప్రేమ వ్యవహారం, తండ్రితో చివరి మాటలు

సారాంశం

విజయవాడలో సంచలనం సృష్టించిన జీవన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు

విజయవాడలో సంచలనం సృష్టించిన జీవన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. యువతి నివసించే ఇంటికి సమీపంలోనే జీవన్ మృతదేహాం వుంది. దీంతో పెదపులిపాకకు చెందిన యువతితో పాటు అతని స్నేహితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నిన్న అర్ధరాత్రి జీవన్ పెదపులిపాక ఎందుకు వెళ్లాడనే కోణంలో ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే తాను జీవన్‌కు ఫోన్ చేయలేదని, తనకే సంబంధం లేదని పోలీసులకు చెప్పింది యువతి. ఇద్దరి కాల్ లిస్ట్‌లు పనిచేస్తున్నారు పోలీసులు. నిన్న అర్ధరాత్రి తండ్రికి ఫోన్ చేసిన జీవన్.. తాను ఇక ఇంటికి తిరిగిరానని చెప్పినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. కృష్ణా జిల్లా వల్లూరు పాలెంకు చెందిన జీవన్ కుమార్ విజయవాడ మాచవరం ప్రాంతంలో ఉంటున్నాడు. నిన్న రాత్రి శ్యామ్ అనే తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అతను ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు జీవన్ కుమార్. ఆ తరువాత పెదపులిపాక పంట పొలాల్లో మృతదేహంగా కనిపించాడు. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

Also Read: విజయవాడలో బీటెక్ విద్యార్థి హత్య... పంటపొలాల్లో పెట్రోల్ పోసి తగలబెట్టి...

తన కుమారుడు పుట్టినరోజు పార్టీకి వెళ్లాడని... రాత్రయినా రాకపోవడంతో ఫోన్ చేస్తే వచ్చేస్తానని చెప్పాడని అతని తండ్రి తెలిపాడు. చివరగా రాత్రి రెండు గంటలకు జీవన్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి వచ్చేస్తాను నాన్న అని చెప్పాడు. ఆ తరువాత గంటకే పోలీసులు ఫోన్ చేశారని.. ముందుగా తాను బండి ఎవరైనా పట్టుకున్నారని అనుకున్నానని అన్నారు. 

అతనికి శత్రువులు ఎవ్వరూ లేరని, స్నేహితులు చాలామంది ఉన్నారని అన్నారు. ఈ రోజు ఎగ్జామ్ కు హాజరు కాలేదని టీచర్ కాలేజ్ నుంచి ఫోన్ చేయడంతో తమకు విషయం తెలిసిందని తెలిపారు. కాసేపట్లో జీవన్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగబోతోంది. ఈ నివేదికలో అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు