వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలకు రిమాండ్ పొడిగింపు..

Published : May 10, 2023, 01:13 PM IST
వివేకా హత్య కేసు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలకు రిమాండ్ పొడిగింపు..

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డిలకు కోర్టు రిమాండ్ పోడిగించింది.

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డిలకు కోర్టు రిమాండ్ పోడిగించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. గతంలో కోర్టు విధించిన రిమాండ్ నేటితో(మే 10) ముగిసింది. దీంతో అధికారులు నేడు వారిద్దరిని సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు వారిని జూన్ 2 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో వారిద్దరని అధికారులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

ఇక, ఇక, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ నెల 14న ఉదయ్ కుమార్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 16న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలను ఏప్రిల్ 19 నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు విచారించేందుకు తెలంగాణ హైకోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారించారు. 

నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో పాత్ర ఉందనే ఆరోపణలకు సంబంధించి సీబీఐ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో రూ. 40 కోట్ల డీల్, నిందితులలో ఒకరైన సునీల్ యాదవ్‌కు రూ. 1 కోటి చెల్లింపు అంశంలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్టుగా  తెలుస్తోంది. ఇక, ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా కోర్టు మే 10 వరకు జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu