విజయవాడలో బీటెక్ విద్యార్థి హత్య... పంటపొలాల్లో పెట్రోల్ పోసి తగలబెట్టి...

Published : May 10, 2023, 02:00 PM IST
విజయవాడలో బీటెక్ విద్యార్థి హత్య... పంటపొలాల్లో పెట్రోల్ పోసి తగలబెట్టి...

సారాంశం

విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బర్త్ డే పార్టీకి వెళ్లిన వ్యక్తి పంటపొలాల్లో విగతజీవిగా కనిపించాడు. 

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ శివారులో దారుణం వెలుగు చూసింది. విజయవాడలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఓ బీటెక్ విద్యార్థి హత్యకు గురయ్యాడు. బీటెక్ మూడు సంవత్సరం విద్యార్థి జీవన్ కుమార్ హత్య చేయబడ్డాడు. జీవన్ కుమార్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థార్డ్ ఇయర్ చదువుతున్నాడు. 

కృష్ణా జిల్లా వల్లూరు పాలెంకు చెందిన జీవన్ కుమార్ విజయవాడ మాచవరం ప్రాంతంలో ఉంటున్నాడు. నిన్న రాత్రి శ్యామ్ అనే తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అతను ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు జీవన్ కుమార్. ఆ తరువాత పెదపులిపాక పంట పొలాల్లో మృతదేహంగా కనిపించాడు. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

రాజమండ్రికి చేరుకున్న పవన్: ఘన స్వాగతం పలికిన నేతలు (ఫోటోలు)

తన కుమారుడు పుట్టినరోజు పార్టీకి వెళ్లాడని... రాత్రయినా రాకపోవడంతో ఫోన్ చేస్తే వచ్చేస్తానని చెప్పాడని అతని తండ్రి తెలిపాడు. చివరగా రాత్రి రెండు గంటలకు జీవన్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి వచ్చేస్తాను నాన్న అని చెప్పాడు. ఆ తరువాత గంటకే పోలీసులు ఫోన్ చేశారని.. ముందుగా తాను బండి ఎవరైనా పట్టుకున్నారని అనుకున్నానని అన్నారు. 

అతనికి శత్రువులు ఎవ్వరూ లేరని, స్నేహితులు చాలామంది ఉన్నారని అన్నారు. ఈ రోజు ఎగ్జామ్ కు హాజరు కాలేదని టీచర్ కాలేజ్ నుంచి ఫోన్ చేయడంతో తమకు విషయం తెలిసిందని తెలిపారు. కాసేపట్లో జీవన్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం జరగబోతోంది. ఈ నివేదికలో అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu
Jogi Ramesh Serious:ఆమాటలు వెనక్కుతీసుకోపోతే..రాధాకృష్ణకు బుద్ది చెప్పేతీరుతాం | Asianet News Telugu