తల్లిదండ్రులకు తెలియకుండా ఏళ్లుగా సహజీవనం... చివరకు జరిగిందిదీ...

Arun Kumar P   | Asianet News
Published : Jun 22, 2021, 11:40 AM IST
తల్లిదండ్రులకు తెలియకుండా ఏళ్లుగా సహజీవనం... చివరకు జరిగిందిదీ...

సారాంశం

కొడుకు మూడేళ్లుగా గుట్టుగా సాగిస్తున్న సంసారం గురించి తెలిసి తల్లిదండ్రులు అవాక్కయిన సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

అమరావతి: తల్లిదండ్రులకు తెలియకుండా ఓ యువకుడు మూడేళ్లుగా ఓ మహిళతో సహజీవనం సాగిస్తుండగా తాజాగా ఈ విషయం బయటపడింది. కొడుకు గుట్టుగా సాగిస్తున్న సంసారం గురించి తెలిసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు.  

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన యేసు కుమార్- ప్రసన్న వెంకట లక్ష్మి ప్రేమించుకున్నారు. ఇద్దరి మనసులు కలవడంలో హద్దులుదాటి పెళ్లికిముందే సహజీవనం చేయసాగారు. ఇరు కుటుంబాలకు తెలియకుండా గుట్టుగా ఈ వ్యవహారాన్ని సాగించారు. ఓ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి మహిళ వుంచాడు యేసుకుమార్. తల్లిదండ్రులకు అనుమానం రాకుండా కేవలం రాత్రి సమయంలో మహిళ వద్దక వెళ్లేవాడు.

read more  కలిసి చనిపోదాం : పెళ్లైన వారానికే.. భార్యతో బలవంతంగా పురుగులమందు తాగించిన భర్త.. !

అయితే రాత్రుళ్ళు మాత్రమే సదరు మహిళ ఇంట్లోకి యువకుడు వెళుతుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళతో పాటు యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. 

అయితే  తమ కుమారుడికి ఇంకా పెళ్లే కాలేదని... అతడు మరో మహిళతో కాపురం చేయడమేంటని యేసు కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. అయితే అతడి మూడేళ్లుగా మహిళతో సహజీవనం చేస్తున్నట్లు... ఇద్దరు సంతానం కూడా వున్నట్లు పోలీసులు తెలపడంతో ఆవాక్కవడం వారి వంతయ్యింది. యేసు కుమార్, ప్రసన్నలతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. 


 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu