స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం: నెగిటివ్ వచ్చిన వారికి చికిత్స, విచారణలో వాస్తవాలు

By Siva KodatiFirst Published Aug 13, 2020, 6:57 PM IST
Highlights

రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో నిర్లక్ష్యం ,భద్రతా రాహిత్యం ఉందన్నారు విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు

రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో నిర్లక్ష్యం ,భద్రతా రాహిత్యం ఉందన్నారు విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హోటల్ ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోలేదన్నారు.

కేర్ సెంటర్ లో కరోనా నెగటివ్ వచ్చిన వారే అధికశాతం ఉన్నారని ఏసీపీ చెప్పారు. మృతుల్లో కూడా 8 మందికి నెగటివ్ వచ్చిందని సూర్యచంద్రరావు వెల్లడించారు. నెగటివ్ ఎప్పటి నుంచి వచ్చింది అన్న వివరాలు కేర్ సెంటర్ లో లేవని.. వైద్య నిపుణుల సలహాలు తీసుకొంటున్నామన్నారు.

పదిమంది మృతికి కారకులైన వారిపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపామని ఏసీపీ వెల్లడించారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కుటుంబం తో సహా పరార్ అయిందని సూర్యచంద్రరావు చెప్పారు. ఈ కేసుల విచారణ కోసం 160 సీఆర్‌పీసీ కింద పదిమందికి నోటీసులు ఇచ్చినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. 

Also Read:ప్రమాదాన్ని గుర్తించే పరికరాలు పనిచేయలేదు: స్వర్ణ ప్యాలెస్‌పై కమిటీ నివేదిక..!

కాగా స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన  అగ్ని ప్రమాదంపై  జేసీ శివశంకర్ నేతృత్వంలో కమిటీ నివేదికను సిద్దం చేసింది.ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు గురువారం నాడు  అందించనున్నారు.

ఈ నెల 9వ తేదీన స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. ఈ  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జేసీ శివశంకర్ కమిటీని ఏర్పాటు చేసింది.

Also Read:స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం: పరారీలో డాక్టర్ రమేష్, శ్రీనివాస్

ఈ కమిటీ  ఈ ప్రమాదంపై విచారణ నిర్వహించింది. ఫైర్, విద్యుత్, వైద్యంతో పాటు భద్రతపై వేర్వేరుగా రిపోర్టులను సిద్దం చేసింది కమిటీ. స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతి కోరుతూ రమేష్ ఆసుపత్రి కోరింది.

మే 18వ తేదీన ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ ధరఖాస్తు చేసుకొంది. అయితే మే 15వ తేదీ నుండే ఇక్కడ కోవిడ్ సెంటర్ నిర్వహించినట్టుగా కమిటీ గుర్తించింది.

click me!