కాలేజీ క్యాంపస్ లో విద్యార్థిని డెలివరీ

By ramya neerukondaFirst Published Dec 14, 2018, 12:36 PM IST
Highlights

కాలేజీ క్యాంపస్ లోనే ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన విజయవాడలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కాలేజీ క్యాంపస్ లోనే ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన విజయవాడలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన 20ఏళ్ల యువతికి ఈ నెల 11వ తేదీన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో.. వెంటనే స్పందించిన సిబ్బంది.. యూనివర్శిటీకి చెందిన డాక్టర్ వద్దకు చికిత్స నిమిత్తం తరలించారు.

కాగా.. ఆ యువతి అప్పటికే ఏడునెలల గర్భవతి అని.. నొప్పులు ప్రారంభమయ్యాయన్న విషయం తెలుసుకొని యూనివర్శిటీ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. 11వ తేదీ  అర్థరాత్రి యువతి.. బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే సిబ్బంది ఆ యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించగా.. వాళ్లు తమ కుమార్తెను ఇంటికి తీసుకువెళతామని చెప్పారు.

అయితే..ఆమెను గర్భవతిని చేసింది ఎవరు అనే విషయం మాత్రం యువతి బయటపెట్టలేదు. ప్రతి నెలా.. సదరు యువతి కడుపులో నొప్పిగా ఉంటోందంటూ.. గుంటూరులోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుందని.. యూనివర్శిటీలో డాక్టర్ ఉన్నప్పటికీ అక్కడ చూపించుకోలేదని వారు చెప్పారు.  బాధితురాలి తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు.

దీంతో.. ఈ ఘటనపై తామే విచారణ జరుపుతామని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 

click me!