విజయసాయి, నాగబాబుల ట్వీట్ వార్: కుక్కలు టు గుంటనక్కలు అన్ని పదాలు వాడేశారు!

By Sree s  |  First Published Apr 13, 2020, 10:32 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ట్విట్టర్లో ఆక్టివ్ గా ఉండే ఈ ఇద్దరు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కొత్తకాదు. వైసీపీలో చాలా మంది నేతలతో నాగబాబు ఇప్పటికే ట్వీట్ వార్ కి దిగారు.


కరోనా వైరస్ వేళ దేశమంతా ఈ వైరస్ ని ఎలా ఎదుర్కోవాలి అని సన్నాహాలు చేస్తున్న టైం లో రాజకీయ వార్తలు ఎక్కువగా మనకు కనబడడం లేదు. కానీ ఈ లోటు తెలుగు ప్రజలకు మాత్రం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ మన రాజకీయ నాయకులు మాత్రం ఆ వైరస్ పేరుతో కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. ట్విట్టర్లో ఆక్టివ్ గా ఉండే ఈ ఇద్దరు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం కొత్తకాదు. వైసీపీలో చాలా మంది నేతలతో నాగబాబు ఇప్పటికే ట్వీట్ వార్ కి దిగారు. ముఖ్యంగా అంబటి రాంబాబు వర్సెస్ నాగబాబు గా నడిచిన ట్వీట్ వార్ చాలాకాలం పాటు సాగింది. 

Latest Videos

ఇక శనివారం మధ్యాహ్నం విజయసాయి రెడ్డి గారు జనసేన పార్టీ కరోనా కాలంలో రాజకీయాలు చేయదంట, అసలు చేయాలంటే గ్రౌండ్ ఉండాలి కదా అని ఎద్దేవా చేసారు. 

"కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?" అని విజయసాయి రెడ్డి అన్నారు. 

దీనికి నాగబాబు ఘాటుగానే స్పందించారు. విజయసాయి రెడ్డిని గుంటనక్కతో పోల్చి తీవ్రంగా ఫైర్ అయ్యారు.గతంలో జనసేనతో పొత్తుకోసం అర్రులు చాచారని, అప్పుడు నాయింటికి రాలేదా అని నాగబాబు అన్నారు. "నువ్వు చెప్పింది కరెక్టే! ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకుతెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి." అని కౌంటర్ ఇచ్చారు. 

ఈ కౌంటర్ కి మరోసారి విజయసాయి రెడ్డి రిప్లై ఇచ్చారు. వైసీపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదని, చిరంజీవి తమ్ముళ్లు కాకపోయి ఉంటే కుక్కలు కూడా మొరగవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. "పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు." అని ట్వీట్ చేసారు. 

దీనికి మరల నాగబాబు కూడా రిప్లై ఇచ్చాడు. "మీరు మా ఇంటికి వచ్చింది 2014 లో కాదు2019 లో ఎలక్షన్స్ కి ముందు.మన కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చారు..మేము సాధారణ మైన వ్యక్తులం.మాకు సినిమాలు టీవీ షో లు చేయకుంటే కుటుంబాలు పోషించలేము.మీకు ఆ అవసరం లేదనుకోండి మంది సొమ్ము బాగా మెక్కారు గా.ఇంకో 1000 ఇయర్స్ కాలు మీద కాలు"..... "వేసుకొని హాయిగా దొంగ లెక్కలు వేసుకొంటు,దోచుకుంటు బ్రతికెయ్యగలరని మాకు తెలుసు.అవార్డ్స్ అందుకోగల పారిశ్రామిక వేత్తలని జైలు పాలు చేసింది తమరి ప్రతిభే కదా..చిన్న విషయం మీరు వైస్సార్ ఆడిటర్ కాకపోయివుంటే శత కోటి గొట్టంగాళ్ల లో ఒక గొట్టంగాడాని వదిలేసి వాడిని.వద్దు సాయి ఈ కారోన టైం లో"...."నీలాంటి గొట్టంగాళ్ళు నాతో ట్వీట్ చేసే బదులు ,ఫ్యూచర్ లో జైల్లో ఏలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో,టైం కలిసి వస్తుంది." అని వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 

ఇక నాగబాబు ఇచ్చిన ఇంత ఘాటు రెప్లైకి విజయసాయి రెడ్డి కూడా అదే రేంజ్ లో స్పందించారు. "చంద్రబాబు కోసం ప్యాకేజి తీసుకుని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసినప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుతూ మాట్లాడాడో ప్రజలందరికి తెలుసు. అలాంటి పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు కోరుకుంటుందని కలేమైనా వచ్చిందా? పార్టీ అధ్యక్షుడు రెండు చోట్లా చిత్తుగా ఓడతాడని అందరికీ ముందే తెలుసు." అని రాసుకొచ్చారు. 

దీనిపై స్పందిస్తూ వైసీపీ వారు ఈ కరోనా ఆపద సమయంలో ఈ కుటిల రాజకీయాలు మానుకోవాలని చెప్పుకొచ్చారు. "ఈ కోవిడ్ 19 pandamic తో country suffer అవుతుంది. ప్రతి మనిషి డైరెక్ట్ గానో ఇండైరెక్టు గానో suffer అవుతున్నారు.ఇలాంటి టైం లో ప్రజల కోసం తన డబ్బు ని కంట్రిబ్యూట్ చేసిన పవన్ కళ్యాణ్ ని ,వితౌట్ any ప్రోవకేషన్,వెటకారంగా విమర్శలు చేసిన మీ వైసీపీ లీడర్స్ విమర్శలని కౌంటర్ చేయాల్సి వచ్చింది..మరో విషయం, జనసేన ఎప్పుడు పాలసీ మేటర్ లొనే విమర్శిస్తే మీరు charcter assainate చేసే విమర్శలు చేస్తున్నారు.వైసీపీ లీడర్స్ ఒక రకం అయిన ఫాసిస్ట్ ధోరణి లో రూల్ చేస్తున్నారు.ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కుడా మీకు కుటిల రాజకీయం చెయ్యడం మానటం లేదు.ఇటువంటి టైం లో మీలాంటి కుటిల రాజకీయ నాయకుల చెత్త విమర్శలపై నేను respond అవ్వతలుచుకోలేదు..జనసేన కార్యకర్త గా ఒక brother గా నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది...కాలం ఎప్పుడు ఒక లా ఉండదు.ప్రజలు మీకు బుద్ది చెప్పే రోజు వస్తుంది.i wish our country will recover from this hard time.." అని వ్యాఖ్యానించారు. 

ఈ ట్వీట్ తరువాత వీరిరువురి మధ్య ట్వీట్ వార్ ఆగిపోయింది. విజయసాయి రెడ్డి గారు నేటి ఉదయం పచ్చ మీడియా అంటూ తన ట్విట్టర్ కి శుభారంభాన్నివ్వగా నాగబాబు ఇంకా నేడు ట్వీట్ చేయలేదు. 

click me!