నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను... ఏం తేలిందంటే: ఎంపీ విజయసాయి రెడ్డి

Arun Kumar P   | Asianet News
Published : Mar 28, 2021, 09:05 AM ISTUpdated : Mar 28, 2021, 09:13 AM IST
నేను కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను... ఏం తేలిందంటే: ఎంపీ విజయసాయి రెడ్డి

సారాంశం

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ సభ్యులు) విజయసాయి రెడ్డి మరోసారి కరోనాబారిన పడినట్లు సోషల్ మీడియాతో పాటు వివిద మాద్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా విజయసాయి స్పందించారు. 

విశాఖపట్నం: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ (రాజ్యసభ సభ్యులు) విజయసాయి రెడ్డి మరోసారి కరోనాబారిన పడినట్లు సోషల్ మీడియాతో పాటు వివిద మాద్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా విజయసాయి స్పందించారు. తాను కరోనా టెస్ట్ చేయించుకున్నమాట వాస్తవమే అయినా పాజిటివ్ వచ్చిందన్న వార్త మాత్రం వాస్తవం కాదన్నారు. గత శుక్రవారం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా కరోనా నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు.  

''భగవంతుని ఆశీర్వాదంతో శుక్రవారం మార్చి 26న కోవిడ్ టెస్ట్ (ఆర్టీపీసీఆర్) నెగిటివ్ వచ్చింది. నాకు కోవిడ్ పాజిటివ్ అని మిత్రులు, శ్రేయోభిలాషులు పరామర్శగా ఫోన్ కాల్స్ చేస్తున్న నేపథ్యంలో వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి. భగవంతని దయవల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. అన్ని పారామీటర్స్ బాగున్నాయి'' అని విజయసాయి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఇప్పటికే ఓసారి ఎంపీ విజయసాయి రెడ్డి కరోనాబారిన పడి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. తాజాగా మరోసారి ఆయన టెస్ట్ చేసుకోగా నెగెటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయనతో పాటు  అనుచరులు, వైసిపి శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu