చంద్రబాబుకి పులివెందల ఫోబియా... విజయసాయి రెడ్డి సెటైర్లు

Published : Feb 29, 2020, 01:34 PM ISTUpdated : Mar 06, 2020, 10:54 AM IST
చంద్రబాబుకి పులివెందల ఫోబియా... విజయసాయి రెడ్డి సెటైర్లు

సారాంశం

విశాఖ పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైద్య శాస్త్రంలో ఎక్కడా లేని ఫోబియా ఒకటి తండ్రీ కొడుకులకు పట్టుకుందంటూ విమర్శించారు.  

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమరుడు లోకేష్ లకు పులివెందల ఫోబియా సోకిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే విజయసాయి రెడ్డి..  సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష నేతలపై విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విజయసాయి విరుచుకుపడ్డారు.

విశాఖ పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైద్య శాస్త్రంలో ఎక్కడా లేని ఫోబియా ఒకటి తండ్రీ కొడుకులకు పట్టుకుందంటూ విమర్శించారు.

Also Read రంగంలోకి సిట్: టీడీపీ నేత లక్ష్మినారాయణ ఇంట్లో సోదాలు, విచారణ...

వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!’ అని వ్యాఖ్యానించారు.

‘ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది’ అంటూ మండిపడ్డారు.

‘ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌ చేశారు.  కాగా.. విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబుని విమానాశ్రయంలోనే అడ్డుకున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్