వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మీడియా, జర్నలిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపాయి. సోషల్ మీడియాలో చర్చకు తెరతీశాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి మీడియాపై, మీడియా ప్రతినిధులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపాయి. సోషల్ మీడియాలో చర్చకు తెరతీశాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు. పార్టీలో కీలక నేతగా, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనపై కొన్ని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న కె.శాంతి అనే మహిళా ఉద్యోగితో విజయసాయి రెడ్డికి సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేరుగా పేర్లు ప్రస్తావిస్తూ తీవ్రమైన పదజాలం వాడారు.
undefined
‘‘మీ పుట్టుకల మీద నాకు అనుమానం ఉందిరా.. మీ జీవితంలో ఎలాంటి విలువలు లేవని బాగా తెలుసు. మీరు చేసే నిరాధార ఆరోపణలు నా జీవితం మీద ప్రభావం చూపవు. నన్ను, నా కుటుంబాన్ని అపహాస్యం చేయడానికి మీరు ఎంతదూరమైనా వెళతారు. కానీ సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతారేంటి? మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను రాజకీయాల్లో ఉన్నా, నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి తప్పులూ చేయలేదు. నాకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. మీ మాటలు, మీ కథనాలు ఎంతమాత్రం నిజం కావు. నేను కొంతమందిని క్షమించను. నా పట్ల కక్షగట్టిన కొన్ని మీడియా సంస్థలు మాపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి పుకార్లు సృష్టించడం, వాటిని ప్రచారం చేయడం సరైన పద్దతి కాదు’’ అని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
విజయసాయి రెడ్డి కొందరు పేర్లు చెబుతూ.. ‘ఒరే, అరే, అది కాదురా’ అంటూ సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు. ఓ మీడియా సంస్థను సీఈవోను దారుణంగా దుర్భాషలాడారు. ‘ఒరేయ్.. మీ పుట్టుకలు మీద నాకు అనుమానం ఉందిరా... ఎవరికి పుట్టావో డీఎన్ఏ టెస్ట్ చేయించుకో..’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన సదరు టీవీ ఛానెల్ సీఈవో నేరుగా స్పందించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి తననేమీ చేయలేరని... ఆయన మాట్లాడిన అంశాలపై ఎక్కడైనా తేల్చుకునేందుకు సిద్ధమని సవాల్ చేశారు.