మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మహిళా ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ జరుగుతున్న ప్రచారం పొలిటికల్ హీట్ పెంచింది. అసలు ఎవరీ ఉద్యోగిని? విజయసాయికి ఎలా పరిచయం..?...
Vijayasai Reddy Kalingiri Shanthi : వైఎస్సార్ కాంగ్రెస్ ను మాంచి రసికుల పార్టీగా ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తుంటాయి. గతంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ల వ్యవహారాన్ని ఉదాహరణగా చెబుతుంటారు. ఇక మహిళా మంత్రులు రోజా, విడదల రజనిలపై కూడా ఇలాగే చాలా దారుణంగా ట్రోల్స్, మీమ్స్ వస్తుండటం చూస్తుంటాం. మాజీ సీఎం,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టంతా ఇలాంటివారే ఉంటారంటూ ప్రత్యర్థి పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి. తాజాగా వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితులు, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై అక్రమ సంబంధం ఆరోపణలు రావడంతో ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.
రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిణితో అక్రమ సంబంధం వుందంటూ ప్రచారం జరుగుతోంది. స్వయంగా సదరు మహిళా ఉద్యోగిని భర్తే ఈ ఆరోపణలు చేసారు. తాను విదేశాల్లో వుండగా భార్య గర్భందాల్చి పిల్లలను కనిందని... ఇందుకు కారకుడు విజయసాయి రెడ్డి అని మహిళా ఉద్యోగిని భర్త ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై సదరు ఉద్యోగినితో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు.
తాజాగా విజయసాయి రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా కొన్ని మీడియా సంస్థలు, ప్రతినిధుల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర పదజాలంతో దూషించారు. అలాగే మహిళా ఉద్యోగినితో తనకు పాలనాపరమైన సంబంధాలే తప్ప ఇతర సంబంధాలేమీ లేవని వివరణ ఇచ్చారు. విజయసాయి రియాక్షన్ తో మరోసారి ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఇంతకు ఎవరీ మహిళా ఉద్యోగిని..? ఏ ఉద్యోగం చేస్తోంది..? ఆమెతో విజయసాయి అక్రమసంబంధం ప్రచారంలో నిజమెంత..? అనేది తెలుసుకుందాం.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి :
ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల ప్రాంతానికి చెందిన ఎస్టీ కుటుంబంలో పుట్టారు కళింగిరి శాంతి. ఆమె చిన్నప్పటి చదువులో చురుకు... దీంతో తల్లిదండ్రులు ఆమెను ఉన్నతచదువులు చదివించారు. ఇలా న్యాయ విద్య పూర్తిచేసారు శాంతి. అయితే చదువుకునే రోజుల్లోనే ఆమెకు మదన్ మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇష్టంగా మారి 2013 లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
కొంతకాలం శాంతి, మదన్ మోహన్ దంపతుల సంసారం సాఫీగా సాగింది. దీంతో 2015 లో ఈ దంపతులు తల్లిదండ్రులయ్యాయి... శాంతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇలా హాయిగా సాగుతున్న వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో 2016 లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇద్దరూ గిరిజనులే కావడంతో వారి సాంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నారు.
భార్య శాంతికి దూరమైన మూడేళ్లతర్వాత అంటే 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్లిపోయాడు. శాంతి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది... కష్టపడి చదివిన ఆమె 2020 లో ఉద్యోగం సాధించింది. సొంత రాష్ట్రంలోనే దేవాదాయ శాఖలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించారామె.
అయితే ఉద్యోగం సాధించిన ఏడాదే సుభాష్ అనే మరో వ్యక్తిని వివాహమాడారు శాంతి. అతడితో మరో బిడ్డను కన్నారు. అయితే ఈ విషయమే ఇప్పుడు వివాదానికి దారితీసింది. తాను విదేశాల్లో వుండగా తన భార్య బిడ్డకు జన్మనిచ్చింది... ఇందుకు ఎంపీ విజయసాయి రెడ్డితో అక్రమ సంబంధమే కారణమని శాంతి మొదటి భర్త మధన్ మోహన్ ఆరోపిస్తుండటంతో వివాదం రాజుకుంది.
విజయసాయి రెడ్డితో శాంతి పరిచయం :
దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరిన శాంతి వివిధ జిల్లాల్లో పనిచేసారు. ఇలా కొంతకాలం విశాఖపట్నంలో కూడా పనిచేసారు. ఈ సమయంలోనే తనకు ఎంపీ విజయసాయి రెడ్డితో పరిచయం ఏర్పడినట్లు శాంతి తెలిపారు.
రాయలసీమలో ఆడపిల్లలు ఇంటినుండి బయటకు పంపించరు... తమ ఎస్టీ కుటుంబాల్లో ఈ కట్టుబాట్లు మరీ ఎక్కువగా వుంటాయని శాంతి తెలిపారు. తాను కూడా అలాగే పెరిగానని... ఉద్యోగం సాధించేవరకు ప్రజాప్రతినిధులెవ్వరినీ కలిసింది లేదన్నారు. అంతవరకు కనీసం సర్పంచ్ ను కూడా కలవని తనకు ఒకేసారి ఎంపీ విజయసాయి రెడ్డి సార్ తో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ పరిచయం కేవలం వృత్తిపరమైనదే అని శాంతి వెల్లడించారు.
విశాఖ బీచ్ రోడ్డులో ప్రేమ సమాజం సంస్థకు 30 ఎకరాలు భూమి వుంది... ఆ భూమి వ్యవహారాలు దేవాదాయ శాఖ చూసుకునేదని శాంతి తెలిపారు. అయితే ఈ భూమిలో సాయి ప్రియా రిసార్ట్ చాలా తక్కువ లీజుతో కొనసాగేదని... విజయసాయి రెడ్డి ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు. దీంతో ఆ భూమిని పరిశీలించి లీజు పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసానని అన్నారు. ఈ విషయంలోనే విజయసాయి రెడ్డి సార్ తో తనకు పరిచయం ఏర్పడిందని దేవాదాయ శాఖ శాంతి తెలిపారు.
అక్రమ సంబంధం వ్యవహారం శాంతి :
ఎంపీ విజయసాయి రెడ్డితో అక్రమ సంబంధం ప్రచారంపై సస్పెండెడ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతి కన్నీటిపర్యంతం అయ్యారు. తన మొదటి భర్త కావాలనే తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేయాలనే ఈ తప్పుడు ప్రచారం చేసారన్నారు. దీన్ని కొన్ని మీడియా సంస్థలు రాజకీయం చేస్తూ తన జీవితంతో ఆడుకున్నాయని ఆరోపించారు. 35 ఏళ్ళ తనకు 68 ఏళ్ళ విజయసాయి రెడ్డితో అక్రమసంబంధం అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసారు.
తానే కాదు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. అంటే ఏ మహిళా ఆఫీసర్ ప్రజాప్రతినిధులతో మాట్లాడొద్దా... అలా చేస్తే తప్పుడు ప్రచారం చేస్తారా? అని నిలదీసారు. తనను గతంలో ఓ అధికారి లైంగికంగా వేధించాడని... అందువల్లే అతడిపై ఇసుక చల్లి తగిన బుద్ది చెప్పానంటూ గతంలో జరిగిన వివాదంపై శాంతి స్పందించారు. అయితే విజయసాయి అండతోనే ఆనాడు శాంతి ఉన్నతాధికారితో ఇలా వ్యవహరించారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది.