కన్నా.. చంద్రబాబు కోవర్టు.. మండిపడ్డ విజయసాయి రెడ్డి

Published : Jul 20, 2020, 11:49 AM ISTUpdated : Jul 20, 2020, 11:56 AM IST
కన్నా.. చంద్రబాబు కోవర్టు.. మండిపడ్డ విజయసాయి రెడ్డి

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా.. కన్నా లేఖ రాయడాన్ని విజయసాయి రెడ్డి తప్పుపట్టారు.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. కన్నా.. చంద్రబాబుకి కోవర్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా.. కన్నా లేఖ రాయడాన్ని విజయసాయి రెడ్డి తప్పుపట్టారు.

ఈమేర‌కు సోమ‌వారం త‌న ట్విట‌ర్ ఖాతాలో.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చంద్ర‌బాబు కోవ‌ర్టు అని మ‌ళ్లీ స్ప‌ష్ట‌మైంద‌ని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్య‌తిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రాజ‌ధాని బిల్లు ఆమోదించ‌వ‌ద్ద‌ని గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశార‌ని విమ‌ర్శించారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్ర‌హానికి గుర‌య్యార‌ని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు క‌న్నా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

PREV
click me!

Recommended Stories

Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu
Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu