50 వేలకు చేరువలో.. ఏపీలో కరోనా ఉగ్రరూపం : కొత్తగా 5,041 కేసులు... 56 మరణాలు

By Siva KodatiFirst Published Jul 19, 2020, 7:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కరోనా కేసుల సంఖ్య కనీవినీ ఎరుగని స్థాయిలో వెలుగుచూశాయి. కేవలం గడిచిన 24 గంటల్లోనే 5,041 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కరోనా కేసుల సంఖ్య కనీవినీ ఎరుగని స్థాయిలో వెలుగుచూశాయి. కేవలం గడిచిన 24 గంటల్లోనే 5,041 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో కరోనా కేసులు 49,650కి చేరింది.

అలాగే వైరస్ కారణంగా ఇవాళ ఒక్కరోజే 56 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 642కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,106 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 13 లక్షల 15 వేల 532 మందికి ఏపీ పరీక్షలు నిర్వహించింది. 

Also Read:యువనేత బర్త్‌డే వేడుకలు: రావులపాలెంలో 25 మందికి కరోనా

కాగా తూర్పు గోదావరి జిల్లా  కొత్తపేట నియోజకవర్గంలోని ఓ యువనేత బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 25 మందికి కరోనా సోకింది. దీంతో ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలకు క్యూ కట్టారు.

కొత్తపేట నియోజకవర్గంలోని ఓ పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకల్లో పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రావులపాలెంలో ఆ నేతతో పాటు మరో 25 మందికి కరోనా సోకింది. 

Also Read:కరోనాతో సత్తెనపల్లిలో వ్యక్తి మృతి: రోడ్డుపైనే డెడ్‌బాడీ

రావులపాలెంలో ర్యాపిడ్ టెస్టు కిట్స్ తీసుకొచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. తమకు కరోనా వచ్చిందేమోననే భయంతో కరోనా పరీక్షలు నిర్వహించుకొనేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 

కరోనా నిబంధనలను బ్రేక్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించినట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పలువురు ప్రముఖులు కూడ పాల్గొన్నట్టుగా ప్రచారం సాగుతోంది. వీరు కూడ కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు.

click me!