పప్పూ! మీ నాన్నను వదిలేయ్!!: నారా లోకేష్ పై విజయసాయి రెడ్డి

By telugu teamFirst Published May 18, 2020, 7:26 AM IST
Highlights

లాక్ డౌన్ ను పొడగించిన నేపథ్యంలో వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి టీడీపి నేత నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు, నారా లోకేష్ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాదులో ఉంటున్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  "పప్పూ.... నాలుగో విడత లాక్ డౌన్ రూల్స్ కూడ వచ్చేశాయ్. మీ నాన్నను ఇప్పటికైనా విదిలేయ్" అని ఆయన అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ హైదరాబాదులో ఉంటున్న విషయం తెలిసిందే. 

డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబు మీద విమర్శలు ఎక్కుపెట్టారు. "బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది" అని ఆయన అన్నారు. 

"పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం పట్టుకుంది బాబుకు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట. రాజధానిలో పేదలకు పట్టాలివ్వకుండా కోర్టు స్టే ఇవ్వడం ఉత్సాహం నింపిందని అంటున్నారు" అని విజయసాయి రెడ్డి అన్నారు. 

"రోజుకు రెండు గంటలు మైకు ముందు ఉపన్యాసం దంచాలి. వీడియో కెమెరాలు రికార్డు చేసేటప్పుడు వెలిగే రెడ్ లైట్ కనిపించాలి. లేకపోతే ముద్ద దిగదు. మనవడితో కాసేపు ఆడుకుని, ఎల్లో ఛానల్స్ లో తన బొమ్మలను చూసుకున్నాకే నిద్రపోతాడు. ప్రజల గురించి ఆందోళన, కార్యకర్తలకు దిశానిర్ధేశం అంతా ఫేకుడే.." అని విజయసాయి రెడ్డి అన్నారు. 

 

పప్పూ...
నాలుగో విడత లాక్ డౌన్ రూల్స్ కూడా వచ్చేశాయ్.
మీ నాన్నని ఇప్పటికైనా వదిలేయ్..

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!