గుప్త నిధుల పేరు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన యువకుడు

Published : May 18, 2020, 07:00 AM ISTUpdated : May 18, 2020, 07:01 AM IST
గుప్త నిధుల పేరు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన యువకుడు

సారాంశం

గుప్త నిధులున్నాయని, బాలికతో కలిసి పూజలు చేస్తే వెలికి తీయవచ్చునని నమ్మించిన ఓ యువకుడు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో గుప్త నిధులున్నాయని, అవి పొందాలంటే బాలికతో కలిసి పూజలు చేయాలని నమ్మించి ఓ యువకుడు ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. 

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం మాచవరానకిి చెందిన విష్ణువర్ధన్ అనే యువకుడు రోగాలు నయం చేస్తానని తాయత్తులు కడుతుంటాడు. దొనకొండ మండలం రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో అతనికి ఇటీవల పరిచయమైంది. 

కొందరికి తాయత్తులు కట్టేందుకు విష్ణువర్ధన్ ను రామాంజనేయులు తమ గ్రామానికి పిలిపించాడు. తెలిసినవారింట్లో బస ఏర్పాటు చేశాడు. ఇంటి యజమాని కూతురిపై విష్ణువర్ధన్ కన్నేశాడు. 

మీ ఇంట్లో గుప్తనిధులున్నాయని, బాలికతో పూజలు చేయిస్తే వాటిని బయటకు తీయవచ్చునని నమ్మించాడు. పూజలు చేయడానికి ఏర్పాటు చేసిన గదిలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. క్షుద్రపూజల గ్రామస్థులు ఆదివారం నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అతనికి దేహశుద్ధి చేశారు. 

PREV
click me!

Recommended Stories

సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి? | Telugu Explainer | Asianet News Telugu
IMD Rain Alert : ఈ సంక్రాంతికి వర్ష గండం.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలం తప్పేలా లేదు