నష్టాల్లోని సంస్ధలను ప్రైవేటీకరించాలన్నదే కేంద్రం ఆలోచన..: విజయసాయి రెడ్డి (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 14, 2021, 3:16 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు త్వరలో దేశ రాజధాని న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటన చేశారు. 

విశాఖపట్నం: తమ ఆధీనంలో వుండి నష్టాలను చవిచూస్తున్న సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని వైసిపి ఎంపీ విజయసాయి అన్నారు. ఇలా నష్టాల్లో ఉన్న సంస్థలను లాభల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలి కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మడమేంటి? అని కేంద్రాన్ని నిలదీశారు. విశాఖ ఉక్క కర్మాగార ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతికరేకిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. 

విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక సంఘాల నాయకులతో వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపిలు ఎంవివి సత్యనారాయణ, సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అమర్నాధ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. 

వీడియో

ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించడంతో పాటుగా లోన్ ను ఈక్విటీ కింద మార్చి వడ్డీ భారం తగ్గించాలని కేంద్రాన్ని కోరారు. మూడో ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లాంట్ ను ఎన్.డి.ఎం.సి తో గాని, సెయిల్ తో గాని విలీనం చెయ్యాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులను కేటాయిస్తే కచ్చితంగా లాభాల బాట పడుతుందన్నారు. ఎక్కడో ఉన్న గనులను కాకుండా దగ్గరలోని సాలూరు, కొటియ గ్రామాల వద్ద ఉన్న మైన్స్ ని కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుందన్నారు. 

read more  విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం: జాతీయ స్థాయిలో నిరసనకు నిర్ణయం, కార్యాచరణ ఇదే

''ఉక్కు ప్యాక్టరీ కార్మిక సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకెళ్ళి ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర ఉక్కుమంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ అంశాలను వివరిస్తాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలను కలుపుకొని పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలియచేస్తాము'' అని వెల్లడించారు. 

''దేశ రాజధాని న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండు రోజుల పాటు నిరసన తెలపాలి అని కార్మిక సంఘాలు  నిర్ణయించారు. ఈ నిరసన కార్యక్రామానికి తాము సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగడతాము'' అని విజయసాయి వెల్లడించారు. 
 

click me!