పోలీస్ శాఖలో కలకలం... డిఎస్పిని బలితీసుకున్న కరోనా మహమ్మారి

By Arun Kumar PFirst Published Apr 18, 2021, 8:22 AM IST
Highlights

కరోనా సెంకండ్ వేవ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే చాలామంది ఈ వైరస్ బారినపడగా తాజాగా ఓ పోలీస్ ఉన్నతాధికారి ఈ వైరస్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. 

విజయనగరం: దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తోంది. సెంకండ్ వేవ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే చాలామంది ఈ వైరస్ బారినపడగా తాజాగా ఓ పోలీస్ ఉన్నతాధికారి ఈ వైరస్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో సీసీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.పాపారావు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

రెండు రోజుల క్రితమే కరోనాబారిన పడిన ఆయనను కుటుంబసభ్యులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే చికిత్స పొందుతుండగానే ఆయన పరిస్థితి మరింత దిగజారి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబంలోనే కాదు పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. డిఎస్పీ పాపారావు మృతిపట్ల విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి, జిల్లా పోలీసులు విచారం వ్యక్తం చేశారు.

read more  తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు కటకట.. చేతులెత్తేస్తున్న ఉత్పత్తిదారులు

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు జెట్ స్పీడ్‌తో పెరిగిపోతున్నాయి. ఏ రోజుకారోజు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. పరిస్ధితి చూస్తుంటే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లో లాగా మన దగ్గర కూడా లాక్‌డౌన్ , నైట్ కర్ఫ్యూ వంటివి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,224 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,55,455కి చేరింది. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,388కి చేరింది. వైరస్ వల్ల చిత్తూరులో 4, నెల్లూరు 3, కర్నూలు 2, విశాఖ 2, గుంటూరు, కడప, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో 2,332 మంది కరోనా నుంచి  కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,07,598కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 40,468 మంది చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం ఒక్కరోజే 35,907 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 1,56,42,070కి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 420, చిత్తూరు 1,051, తూర్పుగోదావరి 906, గుంటూరు 903, కడప 200, కృష్ణ 493, కర్నూలు 507, నెల్లూరు 624, ప్రకాశం 588, శ్రీకాకుళం 662, విశాఖపట్నం 470, విజయనగరం 304, పశ్చిమ గోదావరిలలో 96 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

  

click me!