దుర్గగుడిలో అక్రమాలు: అంతా తానై నడిపిన ఈవో.. విజిలెన్స్ దర్యాప్తులో వాస్తవాలు

By Siva KodatiFirst Published Apr 3, 2021, 2:19 PM IST
Highlights

దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలను గుర్తించారు విజిలెన్స్ అధికారులు . సెక్యూరిటీ టెండర్లలాగానే, శానిటరీ టెంటర్లను నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేసినట్లుగా చెప్పారు. 

దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలను గుర్తించారు విజిలెన్స్ అధికారులు . సెక్యూరిటీ టెండర్లలాగానే, శానిటరీ టెంటర్లను నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేసినట్లుగా చెప్పారు.

మూడు కంపెనీలు టెంటర్లు వేసినా, నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నికల్ సర్వీసెస్‌కు టెండర్లు ఇచ్చారని చెబుతున్నారు విజిలెన్స్ అధికారులు. కమీషనర్ అనుమతి లేకుండా ఈవో సురేశ్ బాబు అగ్రిమెంట్ చేసినట్లుగా గుర్తించారు.

2019లోనే టెండర్ రద్దు చేయాలని అప్పటి కమీషనర్ పద్మ ఆదేశించారు. మార్చి 31తో గడువు ముగిసినా కొత్త టెండర్లు ఫైనల్ చేయకుండా జాప్యం చేసినట్లుగా తేలింది. కొత్తగా శానిటరీ కోసం ఆరుగురు టెండర్లు వేసినా ఫైనల్ చేయలేదు అధికారులు.

దర్యాప్తులో భాగంగా శానిటరీ టెండర్ల విషయంలో ఈవో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు విజిలెన్స్ అధికారులు. ఇటీవల ఫిబ్రవరి నెలలో దుర్గగుడికి సంబంధించిన జమ్మిదొడ్డి లోని ఆలయ పరిపాలన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి దుర్గగుడి పరిపాలనలో అనేక కీలక విభాగాలలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు.

గతంలో జరిగిన ఏసీబీ తనిఖీల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దుర్గగుడి లో బుధవారం నాడు నిర్వహించిన సోదాల్లో విజిలెన్స్ అధికారులు లడ్డు ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు ఉన్నట్టు, దుర్గమ్మ చీరలు విక్రయాలలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

ఈవో సురేష్ బాబు తన సొంత నిర్ణయంతో అమ్మవారి చీరలు విక్రయించినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంతేకాదు అన్నదాన కాంట్రాక్ట్ లో సైతం అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 

click me!