అన్నవరం సత్యదేవుడి ఆలయంలో అక్రమాలపై ఫిర్యాదు: విజిలెన్స్ అధికారుల విచారణ

By narsimha lode  |  First Published May 23, 2022, 2:50 PM IST


పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుడి ఆలయంలో పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.



ఏలూరు:Annavaram దేవాలయంలోని పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని అందిన పిర్యాదులపై విజిలెన్స్ అధికారులు సోమవారం నాడు  విచారణ చేస్తున్నారు. 

అన్నవరం Satyanarayana ఆలయంలోని పలు విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదులపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గత ఏడాద డిసెంబర్ మాసంలో ఆలయంలో విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ విచారణకు కొనసాగింపుగా మరోసారి ఇవాళ కూడా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు విచారణ  చేస్తున్నారు.

Latest Videos

ఆలయంలో అక్రమాలపై గత ధర్మకర్తల మండలి సభ్యుడు 25 అంశాలతో ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సీఎంఓ అధికారులను ఆదేశించారు.

గత ఏడాది డిసెంబర్ 20న విచారణ నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఆలయ రికార్డులను పరిశీలించారు.ఆ తర్వాత దేవాలయంలో పలు రికార్డులను తీసుకుని విచారించారు. గతంలో Vigilance Enforcement ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, సిబ్బంది ఆలయంలో విచారణ చేశారు.  ఆలయానికి సంబంధించిన ఆస్తుల లీజులు, బకాయిల వసూలు, అభివృద్ది పనుల నాణ్యత, అంచనాలు పెంచడం, ఉద్యోగుల నియామకం , పదోన్నతులు, సరుకుల కొనుగోలు వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై రికార్డులను పరిశీలించారు. Temple చైర్మెన్ అర్హతపై కూడా మరో ఫిర్యాదు అందడంతో దీనిపై కూడా విజిలెన్స్ విభాగం అధికారులు పరిశీలించనున్నారు.

రాష్ట్రంలోని పలు ఆలయాల్లో రూ.951 కోట్ల ఖర్చుపై Audit విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా రూ. 70 కోట్ల ఖర్చుపై ఆడిట్ విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విజయవాడ దుర్గగుడిలో రూ. 110 కోట్లు, శ్రీకాళహస్తిలో రూ. 150 కోట్లు, కాణిపాకం విఘ్నేశ్వరుడి ఆలయంలో రూ.122 కోట్ల ఖర్చుపై ఆడిట్ శాఖ అభ్యంతరాలు చెప్పింది. ఇవాళ ఉదయం నుండి ఆలయంలో  విజిలెన్స్ అధికారులు వ్యవస్థాపక ధర్మకర్తల మండలి మాజీ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆలయ రికార్డులను పరిశీలిస్తున్నారు.
 

click me!