విశాఖపట్నంలో ప్రేమ జంట హల్‌చల్.. బైక్ పై కూర్చోబెట్టుకుని రొమాన్స్.. వీడియో వైరల్

Published : Dec 30, 2022, 05:31 PM IST
విశాఖపట్నంలో ప్రేమ జంట హల్‌చల్.. బైక్ పై కూర్చోబెట్టుకుని రొమాన్స్.. వీడియో వైరల్

సారాంశం

విశాఖపట్నంలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ప్రియుడు తాను నడుపుతున్న బైక్ పెట్రోల్ ట్యాంక్ పై ప్రియురాలిని కూర్చోబెట్టుకున్నాడు. ఆ యువతిని తన వైపు తిప్పుకుని కూర్చోబెట్టుకుని బైక్ నడపడం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతున్నది.  

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ చేసింది. నడి రోడ్డుపై పట్టపగలే రొమాన్స్ చేసుకుంటూ వెళ్లింది. ప్రియురాలిని బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోబెట్టుకుని ప్రియుడు వాహనం నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వీరిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ ఘటన జరిగినట్టు ఓ అధికారు గురువారం వెల్లడించారు.

విశాఖపట్నం వద్ద గాజువాక సమీపంలో స్టీల్ ప్లాంట్ రోడ్డు పై ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. కాగా, ఈ వీడియోను కారులో కూర్చున్న ఓ వ్యక్తి రికార్డు చేశారు. బైక్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. అలాగే, ఆ యువతి కాలేజీ యూనిఫామ్‌లో ఉన్నారు. యువతి పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని బైక్ నడుపుతున్న ఆ యువకుడిని హద్దుకుని హగ్ చేసుకుని కూర్చున్నారు. యువత హద్దు మీరి ప్రవర్తిస్తున్నారనే విమర్శలకు తావిస్తున్నది.

Also Read: పట్టపగలు నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంట.. బైక్‌పై రొమాన్స్‌.. వీడియో వైరల్

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. ఇలా బహిరంగంగా ఎంతమాత్రం వాంఛించని విధంలో వారు ప్రవర్తించడంతో స్థానికులు, బాటసారులు నివ్వెరపోయారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!