వెంకన్న దర్శనానికి నకిలీ టికెట్లు: టీటీడీ ఛైర్మెన్ పేరుతోనే బురిడీ

By narsimha lodeFirst Published Oct 5, 2021, 9:41 AM IST
Highlights

టీటీడీ ఛైర్మెన్  దర్శనానికి వచ్చే భక్తులకు నకిలీ టికెట్లు జారీ అయ్యాయి. ఈ విషయమై బాధితులు తమకు న్యాయం చేయాలని  గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.టీటీడీ కార్యాలయం నుండి జారీ చేసినట్టుగా వచ్చిన టికెట్లు నకిలీవని అధికారులు తేల్చారు.
 

గుంటూరు: టీటీడీ ఛైర్మెన్ (ttd chairman) పేరుతో శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు (fake darshan ticket)జారీ చేసి మోసం చేశారంటూ బాధితులు సోమవారం నాడు గుంటూరు అర్బన్ ఎస్పీకి (guntur urban sp)(ఫిర్యాదు చేశారు బాధితులు.

గుంటూరు జిల్లా వెంకటాద్రిపేటకు చెందిన నరేంద్ర (narendra) బ్యాంక్ ఉద్యోగి. తిరుమలలో (tirumala)శ్రీవారి దర్శనానికి టికెట్లు కావాలని  నరేంద్ర బంధువు ఆయనను కోరాడు. దీంతో నరేంద్ర తన బంధువుకు గుంటూరుకు చెందిన నల్లపాడుకు చెందిన వ్యక్తి సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

గత నెల 15, 23 తేదీల్లో ఖాళీలున్నాయని చెప్పారు. ఏ తేదీన దర్శనం కావాలో చెబితే  దర్శనం టికెట్లు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయం నుండి ఇప్పిస్తానని చెప్పాడు. ఒక్కో టికెట్ కు వెయ్యి చొప్పున రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. 

also read:టీటీడీ వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన టికెట్ల బుకింగ్...

15 టికెట్లకు రూ.12,500 చెల్లించేందుకు బాధితులు అంగీకరించారు.  ఫోన్ పే, పేటీఎం ద్వారా  నగదు బదిలీ చేశారు. అయితే బాధితులు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ లు కూడ వచ్చాయి. టీటీడీ ఛైర్మెన్ కార్యాలయం నుండి ఈ టికెట్లు జారీ అయినట్టుగా ఉందని బాధితులు తెలిపారు. గత నెల 23న  తిరుమల సన్నిధానం అతిథి గృహం, బ్లాక్ నెంబర్ 4లో వీటిని చూపితే నకిలీవని తేల్చారు.

టికెట్లు విక్రయించిన వ్యక్తికి ఫోన్ చేస్తే టీటీడీ ఛైర్మెన్ పీఆర్‌ఓను పంపిస్తానని ఆయన లోపలికి పంపుతారని చెప్పారు. కానీ వారి సమస్య పరిష్కారం కాలేదు.  తాము మోసపోయామని బాధితులు గుర్తించారు.  గుంటూరుకుతిరిగి వచ్చి అర్బన్ ఎస్పీకి ఈ విషయమై బాధితులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మెన్ పేరుతోనే నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

click me!