సుద్దపల్లి క్వారీలో ఆందోళన విరమించిన ధూళిపాళ్ల నరేంద్ర...

Published : Feb 10, 2022, 11:00 AM IST
సుద్దపల్లి క్వారీలో ఆందోళన విరమించిన ధూళిపాళ్ల నరేంద్ర...

సారాంశం

సుద్దపల్లి క్వారీలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర చేస్తున్న ఆందోళన విరమించారు. ఈ నేపత్యంలో గనుల్లో మైనింగ్ చేయటం తప్ప వైసీపీకి అభివృద్ది అంటే తెలీదంటూ కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నిరసన తెలిపితే హౌజ్ అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు... 

విజయవాడ : సుద్దపల్లి క్వారీలో మాజీ ఎమ్మెల్యే Dhulipalla Narendra ఆందోళన విరమించారు. అక్రమ మైనింగ్ Suddapalli quarryలో మైనింగ్ అధికారులు కొలతలు తీశారు. Illegal mining చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరల మైనింగ్ జరగకుండా స్థానికులతో కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

దీనిమీద ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. అధికార బలంతో అడ్డగోలుగా మైనింగ్ చేశారంటూ ధ్వజమెత్తారు. అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. దీంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఈ రోజు వచ్చిన అధికారులు కొలతలు తీశారని చెప్పుకొచ్చారు. సుద్దపల్లిలో అక్రమ మైనింగ్ చేయవద్దని స్థానికులు కోరుకుంటున్నారన్నారు. దీనిమీద అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.

అక్రమ మైనింగ్ చేస్తున్న వాహనాలు సీజ్ చేస్తామన్నారన్నారు. స్థానికులతో కలిపి అధికారులు కమిటీ వేసి మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించాం అని.. టిడిపి నేతల్ని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నానన్నారు. ప్రతిపక్షాలు ప్రజల తరుపున పోరాటం చేస్తాయని చెప్పుకొచ్చారు. 

ఇక, వైసీపీ నేతలు  అక్రమ సంపాదన కోసం ప్రకృతి సంపద కొల్లగొడుతున్నారు. ప్రజల్ని కన్నింగ్ చేయటం గనుల్లో మైనింగ్ చేయటం తప్ప వైసీపీకి అభివృద్ది అంటే తెలీదు. హౌస్ అరెస్టులతో మీ  అక్రమాల్ని, అవినీతిని దాచలేరు అంటూ టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. 

వైసీపీ పాలనలో ప్రజల్ని కన్నింగ్ చేయటం, గనుల్లో మైనింగ్ చేయటం తప్ప రాష్ట్ర అభివృద్ది శూన్యం. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో ‎అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న దూళిపాళ్ల  నరేంద్ర‎కు మద్దుతు తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేతల హౌస్ అరెస్టులు దుర్మార్గం. టీడీపీ నేతల్ని చూసి పిబ్రవరి నెలలోనూ జగన్ రెడ్డి చలితో వణుకుతున్నారు. వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే టీడీపీ నేతల్ని ఇంట్లో నుంచి ‎బయటకు  రానివ్వటం లేదు. హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో‎ మీ అక్రమాల్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవాలనుకోవటం అవివేకం. 
            
వైసీపీ నేతలు ప్రజా సమస్యలు గాలికొదిలి ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అక్రమ మైనింగ్, అవినీతి జరుగుతోంది. వైసీపీ నేతలు అక్రమ సంపాదన కోసం ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.  ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ నేతల్ని, ప్రతిపక్షనేతల్ని అక్రమ కేసులు, అరెస్టులతో భయపెడుతున్నారు.  హౌస్ అరెస్టులు చేసిన టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలి, అక్రమైనింగ్ పై విచారణ జరిపి నిజాలు ప్రజలకు చెప్పాలి. ప్రజలు  మీ అరాచకాలన్ని చూస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu