టీడీపీ ఎంపీల విలీనానికి వెంకయ్య ఆమోదం

By narsimha lodeFirst Published Jun 21, 2019, 3:32 PM IST
Highlights

రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
 

న్యూఢిల్లీ: రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తరుణంలో  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

రాజ్యసభలో టీడీపీకి ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఆరుగురు ఎంపీల్లో  సుజనా చౌదరి, టీజీ వెంకటేష్,  సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు‌ టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని గురువారం నాడు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా  టీడీపీపీని బీజేపీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు.

రాజ్యసభలో వెబ్‌సైట్‌లో టీడీపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని అప్‌డేట్ చేశారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించారు.

ఈ విలీన ప్రక్రియ చెల్లదని శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు తర్వాత రాజ్యసభ చైర్మెన్‌ను కలవాలని  ఐదుగురు టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. ఈ లోపునే  విలీన ప్రక్రియకు ఆమోదం తెలపడం  చర్చనీయాంశంగా మారింది.

click me!