అమావాస్య రాత్రి బందిపోటు దొంగల్లా మీరు, మీచొక్కాలు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి

By Nagaraju penumalaFirst Published Feb 12, 2019, 3:07 PM IST
Highlights

అంతటితో ఆగలేదు ఇంకాస్త ముందుకెళ్లి బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు అంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్‌ చదవటం లాంటిదేనని, ఆఖరు నిమిషం దీక్ష వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. 

హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేసుకున్న నల్ల చొక్కాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఇటీవలే అమిత్ షా ఏపీలో పర్యటించినప్పుడు నల్లచొక్కా ధరించిన చంద్రబాబు నిరసన తెలిపారు. ఆ తర్వాత గుంటూరులో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా చంద్రబాబు నల్లచొక్కా ధరించి నిరసన తెలిపారు.   

తాజాగా ఈనెల 11న ఢిల్లీలో ధర్మపోరాట దీక్షలోనూ నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లు వేసుకున్న నల్లచొక్కాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా పంచ్ లు వేశారు. 

నల్లచొక్కాలతో నిరసన తెలుపుతున్న చంద్రబాబును ఆ చొక్కాలను భద్రంగా దాచుకోవాలని సలహా ఇచ్చారు. నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా అంటూ కౌంటర్ వేశారు. 

అంతటితో ఆగలేదు ఇంకాస్త ముందుకెళ్లి బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు అంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు. మరోవైపు చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్‌ చదవటం లాంటిదేనని, ఆఖరు నిమిషం దీక్ష వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. 

నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి గదా. బ్లాక్ షర్టులో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు!

— Vijayasai Reddy V (@VSReddy_MP)

 

పిల్లలు కూడా ఆరాటం కొద్దీ చదువుతారని కానీ పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రావని వివరించారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష కూడా అలాంటిదేనంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబును మించిన అవకాశవాది దేశం మొత్తం మీద ఎక్కడా కనిపించరని మండిపడ్డారు. 

కేంద్ర నిర్మించాల్సిన పోలవరంప్రాజెక్టును దోచుకునేందుకు తానే నిర్మిస్తానని చంద్రబాబు నానా హడావిడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏడాది క్రితం చంద్రబాబు నాయుడును కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్ తిట్టిపోశాడని, కానీ ఇవ్వాళ ఆ ఇద్దరు ఆలింగనాలు చేసుకుంటుంటే ఇంత దిగజారుడుతనమా అనిపిస్తోందన్నారు. 

చంద్రబాబు ఎలాంటి వారో మాజీ ప్రధాని దేవెగౌడకు బాగా తెలుసని, ఆయన ప్రధానిగా ఉండగా ప్రైవేటు విద్యుత్తు కంపెనీలకు లైసెన్సులిప్పించి ఎంత దోచుకున్నారో ఆ విషయాన్ని సీనియర్ నేతలకు చెప్పారని గుర్తు చేశారు. దీక్ష ముగింపు రిచ్‌గా ఉంటుందని బతిమాలితే ఇష్టం లేకున్నా నిమ్మరసం తాగించారని ఆరోపించారు. 

మరోవైపు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ని విజయసాయిరెడ్డి విడిచిపెట్టలేదు. ముందొక చిట్టినాయుడు తర్వాత ఒక చిట్టినాయుడుపేరు పెట్టి  ఘాటు విమర్శలు చేశారు. డబ్బా కొట్టుకోవడంలో చిట్టినాయుడు లోకేష్‌ తండ్రిని మించిపోయాడని ఎద్దేవా చేశారు. 

తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటుంటే, కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో అతి పేద్ద ఉద్యోగం వదులుకొని ప్రజా “షేవ్" కోసం వచ్చానని అంటున్నాడని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 

తండ్రేమో గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటాడు. కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో “అతి పేద్ద” ఉద్యోగం వదులుకొని ప్రజా “షేవ్" కోసం వచ్చానని అంటాడు. నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తిని ఇప్పుడు కొత్త అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

 

నాలుగున్నరేళ్లు చెద పురుగుల్లా రాష్ట్రాన్ని తిని ఇప్పుడు కొత్త అవతారాలు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా కుల మీడియా మాత్రం తెగ హైరానా పడుతుందని విమర్శించారు. 

బులెటిన్ల నిండా దీక్ష విజువల్సేనని, మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి తమ జాతి పిత రుణం తీర్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రైమ్ టైంలో నల్ల చొక్కాల పబ్లిసిటీ గోల చూడలేక జనాలు ఛానళ్లు మార్చుకుంటున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకున్నా కుల మీడియా మాత్రం తెగ హైరానా పడింది.బులెటిన్ల నిండా దీక్ష విజువల్సే.మళ్లీ అరగంట స్పెషల్ ప్రోగ్రాంలు నడిపి తమ జాతి పిత రుణం తీర్చుకున్నాయి. ప్రైమ్ టైంలో నల్ల చొక్కాల పబ్లిసిటీ గోల చూడలేక చానళ్లు మార్చుకున్నారు తెలుగు ప్రేక్షకులు!

— Vijayasai Reddy V (@VSReddy_MP)

 

click me!