విశాఖలో ఆరేళ్ల బాలికను చంపి రక్తం తాగిన మేనత్త

Published : Feb 12, 2019, 02:54 PM IST
విశాఖలో ఆరేళ్ల బాలికను చంపి రక్తం తాగిన మేనత్త

సారాంశం

ఆరేళ్ల బాలికను  చంపి ఆ బాలిక రక్తాన్ని తాగిందో మహిళ. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలో మంగళవారం నాడు చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


విశాఖపట్టణం: ఆరేళ్ల బాలికను  చంపి ఆ బాలిక రక్తాన్ని తాగిందో మహిళ. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలో మంగళవారం నాడు చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లాలోని పెదబయలు మండలం లకేయిపుట్టులో  ఆరేళ్ల బాలిక కొర్ర అనితను ఆమె మేనత్త రస్మో దారుణంగా హత్య చేసింది. లక్ష్మీపేట పంచాయితీ పరిధిలోని కప్పాడు గ్రామానికి చెందిన వంతాల రస్మో నెల రోజులుగా తమ్ముడి ఇంట్లోనే ఉంటోంది.

తమ ఇంటి నుండి వెళ్లిపోవాలని  రస్మోను ఆమె తమ్ముడి భార్య కోరింది.  అయితే తాను ఇంట్లో నుండి వెళ్లిపోతే నీ బిడ్డను చంపేస్తానని కూడ ఆమె బెదిరించినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు.  మంగళవారం నాడు కట్టెల కోసం చిన్నారిని తనతో పాటు తీసుకెళ్లిన రస్మో కత్తితో బలంగా మెడపై నరికింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది,. 

బాలిక రక్తాన్ని కూడ ఆమె తాగినట్టుగా గ్రామస్థులు చెబుతున్నారు. నిందితురాలిని పట్టుకొని గ్రామస్థులు కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే