నర్సరావుపేటలో దారుణం: భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం

Published : Oct 12, 2022, 11:21 AM IST
నర్సరావుపేటలో దారుణం: భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం

సారాంశం

పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో  భార్యను హత్యచేసి  భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వెంకట్రావును పోలీసులు ఆసుపత్రికి తరలించారు.    

నర్సరావుపేట: పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో  బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సరావుపేట పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద రైలు పట్టాలపై  భార్య తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు  వెంకట్రావు. అనంతరం అతను  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని  వెంకట్రావును ఆసుపత్రికి తరలించారు.  వెంకట్రావు భార్య పద్మ మృతదేహన్ని  పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలు స్వస్థలం గురువాయపాలెం గ్రామంగా పోలీసులు గుర్తించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త