ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి.. వెంకయ్యనాయుడు

Published : Dec 05, 2018, 10:32 AM IST
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి.. వెంకయ్యనాయుడు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత  రాజకీయ పరిస్థితులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత  రాజకీయ పరిస్థితులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయంపులు రాజకీయాల్లో చాలా ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని.. ఈ విషయంలో స్పీకర్లు ఆలస్యం చేయకూడదని పేర్కొన్నారు.

ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు సభకు వెళ్లకపోవడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల బడ్జెట్ స్థాయిని మర్చిపోయి.. ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. కులం, మతం, ధనంతో సంబంధం లేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్క ఓటరు.. తమ అభ్యర్థి గుణం, సామర్థ్యం తెలుసుకొని ఆ తర్వాతే ఓటు వేయాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu