
వైసీపీ-భాజపాలు కలుస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి స్పష్టం చేసారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా అభ్యర్ధుల తరపున పురంధేశ్వరి ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భాజపా-వైసీపీ కలవబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో వస్తవం లేదన్నారు.
పురంధేశ్వరి ఓ విషయం మరచిపోయారు. భాజపా-వైసీపీలు కలుస్తున్నాయని ప్రచారం చేసిందే టిడిపి అనుకూల పత్రిక. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా వైసీపీని దెబ్బ కొట్టేందుకు ఓ పచ్చ పత్రికే ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
నిజానికి భాజపా-టిడిపిలు మిత్రపక్షాలు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా రెండు కలిసే ప్రచారం చేయాలి. కానీ నంద్యాలలో మాత్రం భాజపా ప్రచారం చేయలేదు. ఎందుకంటే, ముస్లింల ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అన్న ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడే భాజపా నేతలను దూరం పెట్టారన్నది వాస్తవం.
అయితే, ఆ విషయం ఎక్కడ చర్చకు వస్తుందో అన్న ఉద్దేశ్యంతో పచ్చపత్రిక రివర్స్ ప్రచారం మొదలుపెట్టింది. ముస్లిం ఓట్లను వైసీపీకి పడకుండా చేయటంలో భాగంగానే వైసీపీ-భాజపాలు కలిసిపోతాయనే ప్రచారం చేసింది. నంద్యాలలో ముస్లిం మైరారిటీల ఓట్లు సుమారు 60 వేలున్నాయి.
అయితే, అప్పుడు ఆ విషయమై ఎక్కడా మాట్లాడని పుంధేశ్వరి కూడా ఇపుడు ప్రస్తావించటం విచిత్రం. ఎందుకంటే, కాకినాడలో ముస్లిం ఓట్లు పెద్దగా లేవు. కాబట్టే వైసీపీతో కలవమంటూ చెప్పారు. తాము ప్రస్తుతం రాష్ట్రంలోను, కేంద్రంలోనూ టిడిపితో కలిసే ఉన్నామని చెప్పారు. అదే పొత్తు కొనసాగుతుందని కూడా చెప్పటమే విశేషం. పొత్తుల గురించి ఢిల్లీలోని అగ్ర నాయకత్వం ఆలోచన చేస్తుందట. జగన్ను కలుపుకునే ఆలోచన భాజపాకు లేదని కూడా ఆమె చెప్పారు.